Godavari Boat Accident: ఇంకోసారి ఇది రిపీట్ అవ్వొద్దు: సీఎం వార్నింగ్

ఇంకోసారి నదుల్లో బోటు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఘటన జరిగిన తీరును, సహాయకార్యక్రమాలను శాఖల వారీగా అడిగి తెలుసుకున్న ఆయన.. బోటు ప్రమాదాల నివారణ కోసం ఓ కమిటీని నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బోటు ప్రయాణాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను […]

Godavari Boat Accident: ఇంకోసారి ఇది రిపీట్ అవ్వొద్దు: సీఎం వార్నింగ్

Edited By:

Updated on: Sep 17, 2019 | 11:51 AM

ఇంకోసారి నదుల్లో బోటు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఘటన జరిగిన తీరును, సహాయకార్యక్రమాలను శాఖల వారీగా అడిగి తెలుసుకున్న ఆయన.. బోటు ప్రమాదాల నివారణ కోసం ఓ కమిటీని నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బోటు ప్రయాణాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరిలో ప్రభుత్వ లాంచీలు నడవనప్పుడు, ప్రైవేట్ లాంచీలు ఎందుకు నడుస్తున్నాయని ప్రశ్నించిన ఆయన.. ఈ ఘటనలో ప్రభుత్వ యంత్రాంగం తప్పు ఉందని, ఇకపై బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

కాగా బోటు ప్రమాదాల నివారణ కోసం వేసిన కమిటీకి ఇరిగేషన్‌స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రెవెన్యూ, టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ, అడిషన్‌ డీజీ లా అండ్‌ ఆర్డర్, పోర్టు డైరెక్టర్‌ సభ్యులుగా ఉంటారని ఆయన తెలిపారు. వీటికి కేవలం జీవోలు ఇచ్చి ఊరుకోవడం కాదన్న ఆయన.. వాటిని అమలు జరిగేలా చూసే బాధ్యత కమిటీదేనని స్పష్టంచేశారు. మూడు వారాల్లోగా ఈ ఘటనలపై నివేదిక సమర్పించాలని.. నాలుగోవారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని జగన్ ఆదేశించారు. ఎవరు ఏం చేస్తున్నారన్న దానిపై ఎవ్వరికీ పట్టింపులేదని అధికారులపై ఫైర్ అయ్యారు జగన్. ప్రమాదానికి అసలు కారణం ఇక్కడే ఉందని.. మొత్తం వ్యవస్థను మార్చాలని ఆయన స్పష్టం చేశారు. కంట్రోల్‌ రూం లేకుండా బోట్లు తిరిగే పరిస్థితి ఉండకూడదని.. క్రమం తప్పకుండా బోట్లను తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు. ప్రతిబోటులో జీపీఎస్, వైర్‌లెస్‌ సెట్లు కచ్చితంగా ఉండాలని జగన్ పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకూడదని అధికారులను హెచ్చరించారు. కాగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు-కచ్చలూరు మధ్య ఓ బోటు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా.. వారి మృతదేహాలను వెలికితీశారు. 27మంది సురక్షితంగా బయటపడగా.. మరికొందరు గల్లంతు అవ్వగా.. అయన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.