ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెవెన్యూశాఖపై నిర్వహిస్తున్న సమీక్ష ముగిసింది. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం అర్బన్ హౌసింగ్, టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టిడ్‌కో) పై సీఎం సమీక్ష ప్రారంభమైంది. కేబినెట్ సబ్ కమిటీ కూడా ఈ రివ్యూలో భాగమైంది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎంపీ మిథున్‌రెడ్డి, సంబంధిత అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. టిడ్‌కోలో రివర్స్ టెండరింగ్ అంశం చర్చకు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.