ఎలక్షన్ మిషన్ 2019పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ లీడర్స్, కార్యకర్తలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీకి ఎక్కడ అన్యాయం జరిగిందని అమిత్ షా అంటున్నారు.. ఆంధ్రాకు అన్నింటిలోనూ బీజేపీ అన్యాయమే చేసిందన్నారు. బీజేపీ మేనిఫెస్టోపై కూడా స్పందించారు సీఎం.. వాళ్ల కోసమే ప్రత్యేకంగా రాసుకున్న మేనిఫెస్టో.. తప్ప దాని వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. నమ్మకద్రోహానికి మారుపేరు బీజేపీ పార్టీ అని విమర్శించారు. ఇస్తానన్న హామీలన్నీ.. బూటకాలే అని ఎద్దేవా చేశారు. అమిత్ షా కాదు.. అబద్ధాల షా.. అని అంటే బావుంటుంది. పొట్ట కోస్తే అన్నీ అబద్ధాలే.. అని పేర్కొన్నారు. ఏపీకి హోదా దేవుడి దయగా మేనిఫెస్టోలో పెట్టారు.. జగన్. ఎందులో ఆయన దేవుడిగా కనిపించారని జగన్‌ను ప్రశ్నించారు సీఎం. జగన్ మేనిఫెస్టోలో అసలు అమరావతి గురించే ప్రస్తావన తేలేదు. అబద్ధాల హామీలన్నీ.. జగన్ మేనిఫెస్టోలో పేర్కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.