పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ నిలుపుదల చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. సీఎం జగన్ మూర్ఖత్వపు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. రివర్స్ టెండర్ల వల్ల ప్రాజెక్టుకు నష్టం జరుగుతుందని చెప్పారు. లేని అవినీతిని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఒక్కసారి న్యాయవివాదం మొదలైతే ప్రాజెక్టు పై ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించారు. పోలవరంతో ప్రయోగాలు వద్దని మేం ముందునుంచే చెబుతున్నామన్నారు. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలో.. రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు.