పోలవరం నివేదిక ఇవ్వండి.. ప్రాజెక్టు అథారిటీని కోరిన కేంద్రం

| Edited By: Srinu

Aug 20, 2019 | 12:59 PM

వివాదాస్పదంగా మారిన పోలవరం రివర్స్ టెండరింగ్‌పై కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)నుకోరింది. రివర్స్‌ టెండరింగ్‌కు నోటిఫికేషన్‌ జారీ చేయడం తదితర అంశాల నేపథ్యంలో పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా కోరింది. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం నిర్ణయాల్లో భాగంగా రివర్స్ టెండరింగ్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది సరైన పద్ధతి కాదంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల […]

పోలవరం నివేదిక ఇవ్వండి.. ప్రాజెక్టు అథారిటీని కోరిన కేంద్రం
Follow us on

వివాదాస్పదంగా మారిన పోలవరం రివర్స్ టెండరింగ్‌పై కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)నుకోరింది. రివర్స్‌ టెండరింగ్‌కు నోటిఫికేషన్‌ జారీ చేయడం తదితర అంశాల నేపథ్యంలో పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా కోరింది.

ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం నిర్ణయాల్లో భాగంగా రివర్స్ టెండరింగ్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది సరైన పద్ధతి కాదంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. అయితే లేఖ రాసిన మరుసటి  రోజే రివర్స్‌ టెండరింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో ఆ సమాచారాన్ని కేంద్రానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ అందించినట్టుగా సమాచారం. అయితే పీపీఏ నివేదిక తర్వాతే పోలవరంపై కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.