తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం గుడ్‌న్యూస్

తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం తీపి కబురు అందించింది. ఇరు రాష్ట్రాలకు కొత్తగా 18 మంది ఐఏఎస్‌లను కేంద్రం కేటాయించింది. ఏపీకి 11 మంది, తెలంగాణకు తొమ్మిది మంది ఐఏఎస్‌లను కేటాయిస్తూ.. అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఐఏఎస్‌ల కొరత ఉంది. పరిపాలనకు అవసరమైన మేర కంటే తక్కువ మంది ఐఏఎస్‌లు ఉన్నారు. దీనికి తోడు మరికొందరు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా […]

తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం గుడ్‌న్యూస్
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2019 | 12:39 PM

తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం తీపి కబురు అందించింది. ఇరు రాష్ట్రాలకు కొత్తగా 18 మంది ఐఏఎస్‌లను కేంద్రం కేటాయించింది. ఏపీకి 11 మంది, తెలంగాణకు తొమ్మిది మంది ఐఏఎస్‌లను కేటాయిస్తూ.. అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఐఏఎస్‌ల కొరత ఉంది. పరిపాలనకు అవసరమైన మేర కంటే తక్కువ మంది ఐఏఎస్‌లు ఉన్నారు. దీనికి తోడు మరికొందరు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలుచేయడానికి ఉన్నతాధికారులు కరువయ్యారు. ఇలాంటి నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు మరికొంతమంది ఐఏఎస్‌లను కేటాయించడం ఆనందించదగ్గ విషయం.

ఇక ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌ల లిస్ట్‌లో సూర్య సాయి ప్రవీణ్ చంద్, భావన, మల్లారపు నవీన్, వీ. అభిషేక్, అపరాజితా సింగ్, జైకుమరన్, విష్ణు చరణ్, నిధి మీన, కట్టా సింహాచలం, వికాస్ మర్మత్, చాహట్ భాజ్‌పయ్‌లు ఉన్నారు. అలాగే తెలంగాణకు క్రాంతి వరుణ్ రెడ్డి, చిత్రా మిశ్రా, పాటిల్ హేమంత్ కేశవ్, గరిమా అగర్వాల్, దీపక్ తివారి, అంకిత్, ప్రతిమా సింగ్‌లు ఖరారయ్యారు. ఇక వీరంతా  2019 బ్యాచ్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌లు కావడం గమనార్హం.