ధర్మానకు సీబీఐ షాక్.. విచారణకు ఆదేశం

| Edited By:

Jan 09, 2020 | 8:34 AM

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సీబీఐ షాక్ ఇచ్చింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల వ్యవహారంలోని వాన్‌పిక్ కేసులో ధర్మాన ప్రసాదరావుపై ఉన్న ఆరోపణలపై విచారణ చేపట్టొచ్చని దర్యాప్తు సంస్థ సీబీఐ వెల్లడించింది. అవినీతి నిరోధక చట్టం కింద ఉన్న కేసులను విచారణ నిమిత్తం పరిగణలోకి తీసుకుంటూ సీబీఐ కోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీం సమర్ధించిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి సీబీఐ కోర్టు ఉత్తర్వులను […]

ధర్మానకు సీబీఐ షాక్.. విచారణకు ఆదేశం
Follow us on

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సీబీఐ షాక్ ఇచ్చింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల వ్యవహారంలోని వాన్‌పిక్ కేసులో ధర్మాన ప్రసాదరావుపై ఉన్న ఆరోపణలపై విచారణ చేపట్టొచ్చని దర్యాప్తు సంస్థ సీబీఐ వెల్లడించింది. అవినీతి నిరోధక చట్టం కింద ఉన్న కేసులను విచారణ నిమిత్తం పరిగణలోకి తీసుకుంటూ సీబీఐ కోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీం సమర్ధించిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి సీబీఐ కోర్టు ఉత్తర్వులను సమర్థించిందని, అందుకే అవినీతి నిరోధక చట్టం కింద ఉన్న ఆరోపణలపైనా విచారణ చేపట్టొచ్చని సీబీఐ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ధర్మానను విచారించొచ్చు అంటూ సీబీఐ కోర్టుకు తెలిపింది. అయితే జగన్ అక్రమాస్తుల కేసులో ధర్మాన ప్రసాదరావుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన కేసు ఎంతవరకు వచ్చిందని హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి బీవీ మధుసూధన్ రావు ఇటీవల సీబీఐని వివరాలు కోరారు. దీనికి సంబంధించి జనవరి 7వ తేదీలోపు తమకు వివరాలు అందించాలని ఆయన ఆదేశించిన విషయం తెలిసిందే.