రాజధానిపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు మర్మమేమిటి..?

| Edited By:

Dec 22, 2019 | 2:13 PM

ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో నిరసన సెగలు కొనసాగుతున్నాయి. తుళ్లూరులో ధర్నా చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు.. వంటా వార్పు కార్యక్రమం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీయేతర పార్టీల్లో కొంతమంది జగన్ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత సోము వీర్రాజు రాజధాని నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై చంద్రబాబు తీవ్ర రాద్ధాంతం చేస్తున్నారని […]

రాజధానిపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు మర్మమేమిటి..?
Follow us on

ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో నిరసన సెగలు కొనసాగుతున్నాయి. తుళ్లూరులో ధర్నా చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు.. వంటా వార్పు కార్యక్రమం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీయేతర పార్టీల్లో కొంతమంది జగన్ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

తాజాగా బీజేపీ నేత సోము వీర్రాజు రాజధాని నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై చంద్రబాబు తీవ్ర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఏ రాష్ట్రంలోనైనా రాజధాని కోసం చర్చ జరిగిందా..? అని ప్రశ్నించిన ఆయన.. చంద్రబాబు ట్రాప్‌లో వైసీపీ పడుతోందని అన్నారు. హైదరాబాద్ వల్లే రాష్ట్ర విభజన ఇబ్బందులు వచ్చాయని సోము వీర్రాజు గుర్తుచేశారు. చంద్రబాబు ఒక్క పోర్టునైనా కట్టారా..? అని ఆయన అడిగారు. ప్రస్తుతం పోర్టులు కట్టేందుకు వైసీపీ ప్రభుత్వం యత్నిస్తోందని.. రాష్ట్రాభివృద్ధి కోసం ఏం చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని సోము వీర్రాజు అన్నారు. రాజధాని నిర్మాణం సైలెంట్‌గా జరగాలి అని ఆయన ఆకాంక్షించారు. త్వరలో 25 జిల్లాలుగా విభజన చేస్తారని.. బీజేపీ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తోందని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. అయితే ఆయన మాటలను బట్టి చూస్తుంటే రాజధానిపై జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్ధతిస్తున్నారా..? అన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీకి చెందిన కొందరు నేతలు రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే.