Weather Report : వాతావరణ సూచన : ఉత్తరాంధ్ర, యానాంలో ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు, రేపు, ఎల్లుండి ఏపీ వ్యాప్తంగా..

Andhra Pradesh Weather Report : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ఎత్తున తూర్పు / ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది...

Weather Report : వాతావరణ సూచన :  ఉత్తరాంధ్ర, యానాంలో ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు, రేపు, ఎల్లుండి ఏపీ వ్యాప్తంగా..
Weather Report

Updated on: Mar 28, 2021 | 2:59 PM

Andhra Pradesh Weather Report : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ఎత్తున తూర్పు / ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు వెల్లడించింది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో ఈ రోజు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఇక, దక్షిణ కోస్తా ఆంధ్రలో ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఇక, రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి వాతావరణం ప్రధానంగా పొడిగా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Read also : Japan gives India 225 bn Yen : చిన్న దేశం, పెద్ద మనసు : భారత్‌కు రెండు బిలియన్ డాలర్ల సాయం చేస్తున్న మిత్ర దేశం ఏదో తెలుసా.?