వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్, విడుదల

| Edited By: Pardhasaradhi Peri

Jan 13, 2020 | 12:42 PM

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధాని వికేంద్రీకరణ జరగాలంటూ మంగళగిరిలో ఆయన ఆధ్వర్యంలో భారీ ర్యాలీకి పూనుకున్నారు. ఈ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. ఆర్కేను తమ అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత మంగళగిరి పీఎస్‌కు తరలించారు. ఆ తరువాత కాసేపటికే ఆయనను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘రైతులను చంద్రబాబు మోసం చేశారు. అమరావతిపై కావాలనే చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారు. నా ర్యాలీకి కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ర్యాలీ చేపట్టినందుకే […]

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్, విడుదల
Follow us on

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధాని వికేంద్రీకరణ జరగాలంటూ మంగళగిరిలో ఆయన ఆధ్వర్యంలో భారీ ర్యాలీకి పూనుకున్నారు. ఈ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. ఆర్కేను తమ అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత మంగళగిరి పీఎస్‌కు తరలించారు. ఆ తరువాత కాసేపటికే ఆయనను విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘రైతులను చంద్రబాబు మోసం చేశారు. అమరావతిపై కావాలనే చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారు. నా ర్యాలీకి కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ర్యాలీ చేపట్టినందుకే నన్ను అరెస్ట్ చేశారు. అధికార వికేంద్రీకరణ కోసం మేం ర్యాలీ చేస్తే అరెస్ట్ చేశారు. 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉంటే ఎవ్వరికీ అనుమతి ఇవ్వరు. ధర్నాల పేరుతో చంద్రబాబు మోసం చేస్తున్నారు. ఐదేళ్లు సీఎంగా ఉండి రాజధాని పేరుపై వేల కోట్లు దోచుకున్నారు. రాజధానిపై అధికారిక ప్రకటన రాకముందే ప్రజలను రెచ్చగొడుతున్నారు. రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. బీహార్‌లోని ఘటనలు అమరావతిలో జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు.