ఏపీలోని విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాం ఏర్పాటుకు పనులు చురుకుగా సాగుతున్నాయి. విగ్రహ నిర్మాణం పనులను పరిశీలించేందుకు ఏపీ మంత్రుల బృందం ఢిల్లీలో పర్యటించింది. ఢిల్లీ టూర్‌లో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఛైర్మన్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంత్రులతో పాటు.. పలువురు అధికారులు కూడా పనులను పరిశీలించారు. బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్ పథకంలో భాగంగా విజయవాడలోని PWD మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహం పనులను చూసేందుకు హర్యానా గురుగావ్‌లోని మనేసర్‌లో ఉన్న మాథురామ్ స్టేడియాన్ని మంత్రులు సందర్శించారు. అక్కడ జరుగుతున్న అంబేద్కర్ విగ్రహ నమూనాలను పరిశీలించారు మంత్రులు, అధికారులు. అయితే.. ఇక్కడ బంక మట్టితో చేసిన చేసిన అంబేద్కర్ విగ్రహ నమూనాను పరిశీలించింది. విగ్రహ నిర్మాణానికి ఆమోదం తెలపేందుకే ఢిల్లీకి పర్యటనకు వచ్చినట్టు మంత్రులు తెలిపారు.
కాగా రాబోయే అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 నాటికి అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పూర్తి చేసి ఆవిష్కరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పనులన్నీ ఏక కాలంలో త్వరిత గతిన పూర్తి చేసేందుకు అధికారులు ప్లాన్ రెడీ చేశారు. విగ్రహం పనులను వేగంగా పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు అంబేద్కర్ విగ్రహ కమిటీ మంత్రుల టీమ్ ఛైర్మన్ మేరుగు నాగార్జున. సీఎం జగన్ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన చేసేందుకు చర్యలు చేపడుతామన్నారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న సామాజిక న్యాయానికి ప్రతీకగా విగ్రహ ప్రతిష్టాపన ఉంటుందన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో వైసీపీ ప్రభుత్వ నడుస్తుందన్న మంత్రి.. విగ్రహం నిర్మాణానికి 250 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..