AP Minister Perni Nani briefing: పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన అంశం కెబినెట్లో ప్రస్తావనకు వచ్చిందని ఏపీ మంత్రి పేర్ని నాని చెప్పారు. మెకానికల్ ఫెయీల్యూర్ వల్ల గేట్ కొట్టుకుపోయిందని ప్రాథమికంగా నిర్దారించారని ఆయన పేర్కొన్నారు. మాన్యువల్ ఆపరేటెడ్ గేట్లు కాకుండా హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని కేబినెట్ ఆదేశించినట్లు మంత్రి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
గ్రామ సచివాలయాలకు మంత్రులు.. ఎమ్మెల్యేలు పర్యటనలు ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి పేర్ని వెల్లడించారు. నెలలో 12 రోజుల పాటు ఎమ్మెల్యేలు గ్రామ సచివాలయాల సందర్శన ఉండాలని మంత్రి వర్గం సూచించిందని మంత్రి తెలియజేశారు.
వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాషాయ కండువా వేసుకున్న బీజేపీ వాళ్లు ప్రయత్నిస్తున్నారంటూ మంత్రి ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. తాము ఆ సీట్లో కూర్చొవాలని బీజేపీ ఆశ పడుతుందని ఎద్దేవా చేసిన పేర్ని.. కర్నూల్లో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తే తప్పేంటీ..? అని మీడియా ముఖంగా ప్రశ్నించారు.
Read also: Bears Hulchul: ఏ చెట్టు పైన ఎలాంటి ఎలుగుబంటి ఉందో…!!! హడలెత్తిపోతోన్న జనాలు