మధ్యం ధరలు పెంచి నిరుత్సాహపర్చాలని అన్నారు.. మరిప్పుడు..

|

Sep 04, 2020 | 4:55 PM

ఏపీలో జగన్ సర్కారు కరోనా లాక్ డౌన్ సడలింపుల అనంతరం మద్యం రేట్లను ఒక రేంజ్ లో పెంచింది. 75 శాతంకు పైగా ధరలను అమాంతం పెంచి మందుబాబుల గొంతుమీద కొట్టింది. అయితే, అప్పుడు సర్కారీ పెద్దలు చెప్పిన వివరణ ఏంటంటే..

మధ్యం ధరలు పెంచి నిరుత్సాహపర్చాలని అన్నారు.. మరిప్పుడు..
Follow us on

ఏపీలో జగన్ సర్కారు కరోనా లాక్ డౌన్ సడలింపుల అనంతరం మద్యం రేట్లను ఒక రేంజ్ లో పెంచింది. 75 శాతంకు పైగా ధరలను అమాంతం పెంచి మందుబాబుల గొంతుమీద కొట్టింది. అయితే, అప్పుడు సర్కారీ పెద్దలు చెప్పిన వివరణ ఏంటంటే.. మద్యం తాగుడుని నిరుత్సాహపర్చి.. క్రమంగా మద్యాన్ని అరికట్టాలనే ఈ చర్యకు ఉపక్రమించామని చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది జగన్ సర్కారు. ఈ క్రమంలో ఇప్పుడేమంటారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి స్పందించారు. ఇటీవల కాలంలో కొంతమంది పేద‌లు శానిటైజ‌ర్లు తాగి చ‌నిపోవ‌డం చాలా బాధాక‌రమని.. అలాంటివారిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ప్రభుత్వం చీప్ లిక్కర్ ధరలను తగ్గించిందని వివరణ ఇచ్చారు. మద్య నియంత్రణ కృషిలో ఇది ఒక భాగమని చెప్పారు. చ‌రిత్ర‌లో ఎన్నడూ లేని విధంగా 43 వేల బెల్ట్ షాపులు తొలగించామ‌ని, ఇప్ప‌టికే 33 శాతం మద్యం షాపులు, బార్లను తగ్గించామని లెక్కలు ఏకరువుపెట్టారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దశల వారిగా మద్య నిషేధానికి ప్ర‌భుత్వం కృషి చేస్తుంటే చంద్రబాబు, టీడీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కౌంటరిచ్చారు.