ఆ వార్తలు అవాస్తవం.. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ క్లారిటీ

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోందని ఈరోజు ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో విరివిగా ప్రచారం జరిగింది.

ఆ వార్తలు అవాస్తవం.. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ క్లారిటీ

Updated on: Jul 10, 2020 | 10:03 PM

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోందని ఈరోజు ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో విరివిగా ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలు అవాస్తవమని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్‌ కె. వెంకట రామిరెడ్డి స్పష్టం చేశారు. పదవీ విరమణ వయస్సును తగ్గించాలని గానీ పెంచాలనే ప్రతిపాదన గానీ ప్రభుత్వం దగ్గర లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు కావాలని కుట్ర చేస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి నిరాధర వార్తల పట్ల ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఇక ఇలాంటి పుకార్లు సోషల్ మీడియాలో వచ్చినప్పుడు వాటి పూర్వాపరాలు పరిశీలించకుండా ఇతరులకు పంపకండని ఆయన కోరారు. దీనిపై ఏపీ డీజీపీ గారిని కలిసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతామని వెంకట రామిరెడ్డి వెల్లడించారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us