
Jagan Meet Modi: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఇద్దరు ఎంపీలు, 10 మంది అధికారులతో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్.. ఏపీ భవన్‌లో బస చేశారు. పీఎం మోదీతో ఈ ఉదయం 10.40 నిమిషాలకు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏపీలో జరిగిన తాజా రాజకీయ పరిణామాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధానంగా అమరావతి భూములపై సీబీఐ విచారణ, మూడు రాజధానుల వ్యవహారం, రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు పోలవరం నిధులపై చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ టూర్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్.. కొందరు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని సమాచారం.
Also Read: