స్పీకర్, సభాధ్యక్షుడు ఎలా ఉండాలో ఈ సభ చూస్తుంది: వైఎస్ జగన్

| Edited By:

Jun 13, 2019 | 11:41 AM

ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా బాధ్యతలు తీసుకున్న తమ్మినేని సీతారాంకు ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. చట్టసభలపై అవగాహన ఉన్న వ్యక్తిని స్పీకర్‌గా ఎంపిక చేశామని జగన్ పేర్కొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఇదే శాసనసభలో విలువలు లేని రాజకీయాలు చూశామని.. ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వని రాజకీయాలు చూశామని.. ఇప్పుడు తాను కూడా అలాగే చేస్తే మంచి అనేది ఎక్కడా కనపడదని ఆయన అన్నారు. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలని […]

స్పీకర్, సభాధ్యక్షుడు ఎలా ఉండాలో ఈ సభ చూస్తుంది: వైఎస్ జగన్
Follow us on

ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా బాధ్యతలు తీసుకున్న తమ్మినేని సీతారాంకు ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. చట్టసభలపై అవగాహన ఉన్న వ్యక్తిని స్పీకర్‌గా ఎంపిక చేశామని జగన్ పేర్కొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఇదే శాసనసభలో విలువలు లేని రాజకీయాలు చూశామని.. ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వని రాజకీయాలు చూశామని.. ఇప్పుడు తాను కూడా అలాగే చేస్తే మంచి అనేది ఎక్కడా కనపడదని ఆయన అన్నారు. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదని.. అనర్హత వేటు వేయని ప్రభుత్వంపై ప్రజలే అనర్హత వేటు వేశారని తెలిపారు.

23మంది ఎమ్మెల్యేలను కొంటే 23 సీట్లే వచ్చాయని.. ముగ్గురు ఎంపీలను తీసుకుంటే ముగ్గురు ఎంపీలే గెలిచారని.. దేవుడు స్క్రిప్ట్ గొప్పగా రాశారని వైఎస్ జగన్ అన్నారు. ఓ ఐదుగురు ఎమ్మెల్యేలను లాగితే.. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా దక్కదని తనతో ఒకరు అన్నారని.. అలా చేస్తే చంద్రబాబుకు, తనకు తేడా లేదని పేర్కొన్నారు. ఇక స్పీకర్, సభాధ్యక్షుడు ఎలా ఉండాలో ఈ సభ చూస్తుందని ఆయన పేర్కొన్నారు. పార్టీ మారానుకున్న ఎమ్మెల్యేలను రాజీనామా చేయిస్తామని.. రాజీనామా చేయకుంటే డిస్‌క్వాలిఫై చేయాలని స్పీకర్‌ను కోరుతున్నానని వైఎస్ జగన్ వెల్లడించారు.