ఏసీజేతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

 అమరాతి : ఏపీ సీఎం జగన్ పాలనలో సంస్కరణల కోసం మరో అడుగు ముందుకు వేశారు.  హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌ను సీఎం కలిశారు. మంగళవారం సాయంత్రం ఉండవల్లిలోని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నివాసం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. కాంట్రాక్టుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకతను పాటించడం కోసం జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేసే విషయంపై ఏసీజేతో చర్చించారు. సీఎం వైఎస్‌ జగన్‌ వెంట న్యాయనిపుణులు, ఇతర నేతలు ఉన్నారు. కాగా […]

ఏసీజేతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

Updated on: Jun 04, 2019 | 6:48 PM

 అమరాతి : ఏపీ సీఎం జగన్ పాలనలో సంస్కరణల కోసం మరో అడుగు ముందుకు వేశారు.  హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌ను సీఎం కలిశారు. మంగళవారం సాయంత్రం ఉండవల్లిలోని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నివాసం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. కాంట్రాక్టుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకతను పాటించడం కోసం జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేసే విషయంపై ఏసీజేతో చర్చించారు. సీఎం వైఎస్‌ జగన్‌ వెంట న్యాయనిపుణులు, ఇతర నేతలు ఉన్నారు. కాగా ఇదే విషయాన్ని జగన్ ప్రమాణ స్వీకారం రోజు ప్రస్తావించిన సంగతి తెలిసిందే.