జగన్‌ అన్నా.. మీ వల్ల ఏదీ కాదంటూ కేశినేని నాని ట్వీట్..

| Edited By:

Jan 28, 2020 | 12:21 PM

ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. రోజు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం తారా స్థాయికి చేరుకుంటుంది. కొందరు మీడియా ముందు ఆరోపణలు గుప్పించుకుంటే.. మరికొందరు సోషల్ మీడియా వేదికగా సవాళ్లు విసురుకుంటూ.. ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నానీ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ.. ట్విట్టర్ వేదికగా విమర్శలకు దిగారు. “జగన్ అన్నా.. నువ్వూ నీ ముఠా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి నుండి రాజధానిని ఒక అంగుళం కూడా కదల్చలేరంటూ ట్వీట్ […]

జగన్‌ అన్నా.. మీ వల్ల ఏదీ కాదంటూ కేశినేని నాని ట్వీట్..
Follow us on

ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. రోజు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం తారా స్థాయికి చేరుకుంటుంది. కొందరు మీడియా ముందు ఆరోపణలు గుప్పించుకుంటే.. మరికొందరు సోషల్ మీడియా వేదికగా సవాళ్లు విసురుకుంటూ.. ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నానీ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ.. ట్విట్టర్ వేదికగా విమర్శలకు దిగారు. “జగన్ అన్నా.. నువ్వూ నీ ముఠా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి నుండి రాజధానిని ఒక అంగుళం కూడా కదల్చలేరంటూ ట్వీట్ చేశారు. హైకోర్టును అమరావతి నుండి మార్చలేరని.. శాసనమండలిని రద్దు చెయ్యాలనే మీ ప్రతిపాదన జరిగే పని కాదు. మీ వల్ల ఏదీ కాదు” అంటూ ట్వీట్ చేశారు.

ట్వీట్‌తో పాటుగా ఓ జాతీయ మీడియా కథనాన్ని కూడా అటాచ్ చేశారు. దేశంలో శాసన మండళ్లు ఏర్పాటు చేయడం.. లేదా రద్దు చేయడం అనే అంశాలపై ఓ జాతీయ విధానం ఉండాలని గతంలో పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైందని గుర్తు చేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా శాసన మండళ్లను రద్దు చేసుకుంటూ పోవడం సరైంది కాదంటూ ఆ కమిటీ అభిప్రాయాన్ని తెలిపింది. రాజస్థాన్‌లో శాసనమండలి ఏర్పాటుకు ఆ కమిటీ అప్పట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.1986లో తమిళనాడులో ఎంజీ రామచంద్రన్ సీఎంగా ఉన్న సమయంలో శాసనమండలి కౌన్సిల్‌ను రద్దు చేశారని.. ఆ తర్వాత డీఎంకే అధికారంలోకి వచ్చార దాన్ని తిరిగి పునరుద్దరించారన్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా 1985లో శాసనమండలిని రద్దుచేశారన్నారు. అప్పడు సీఎంగా ఎన్టీఆర్ ఉన్నారని.. ఆ తర్వాత 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మండలిని పునరుద్ధరించారన్నారు. అయితే ఈ రెండు సార్లు కేంద్రం ఆమోదంతోనే జరిగిందన్నారు.