న్యూఢిల్లీ : సీఎం జగన్ పులివెందుల, అనంతపురం పర్యటనలు రద్దయ్యాయి. ఢిల్లీలో కీలక నేతల్ని కలవాల్సి ఉన్నందున గురువారం పులివెందుల, అనంతపురం జిల్లాల్లో సీఎం పర్యటనలు ఉండబోవని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి వెల్లడించారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం ఉందని అన్నారు. రద్దయిన పర్యటనలు యధావిధిగా ఉంటాయని, వాటికి సంబంధించిన తేదీలు సీఎంవో అధికారులు త్వరలో వెల్లడిస్తారని చెప్పారు.