Weather Report: దక్షిణమధ్య బంగాళాఖాతంలో ‘అల్పపీడనం’.. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..

|

Oct 27, 2021 | 7:56 PM

మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం దక్షిణమధ్య బంగాళాఖాతంలో 'అల్పపీడనం' ఏర్పడింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉంది...

Weather Report: దక్షిణమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
ఈ అల్పపీడనానికి అనుసంధానంగా ఉపరితల ఆవర్తనం 5.8 కి.మీ ఎత్తున కొనసాగుతుంది.
Follow us on

మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం దక్షిణమధ్య బంగాళాఖాతంలో ‘అల్పపీడనం’ ఏర్పడింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉంది. రాగల 3 రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తర్ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం
ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర 
ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని, భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.

రాయలసీమ 
ఈరోజు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Read Also.. Andhra Pradesh: 48 వేల మందికి ఉద్యోగాలు.. కీలక ప్రాజెక్టులకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్