ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం నేడు (ఆగస్టు 6న) జరగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రహదారులు, భవనాల శాఖకు చెందిన రూ. 4 వేల కోట్ల ఆస్తులను ఆర్టీసీకి బదలాయించే అంశంపై ప్రతిపాదనలు చేయనున్నట్లు సమాచారం. అలాగే ఏపీ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చించే అవకాశం కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. నూతన సీడ్ పాలసీపై చర్చలు జరిగే అవకాశం ఉందని, జాతీయ విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏలా అమలు చేయాలనే అంశంపై అధికారులతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం చర్చించనున్నారు.
వీటితో పాటు నేతన్న నేస్తంపై కూడా చర్చింతే అవకాశం ఉంది. ఇక నాడు- నేడు రెండో దశ పనులను ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పోలవరం ముంపు భాదితులకు అదనంగా డబ్బులు పంపిణీ చేసే అంశంపైనా నేడు చర్చించనున్నారు. గతంలో తక్కువ ఇచ్చిన వారికి నష్ట పరిహారం కింద ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షల రూపాయలు అదనంగా ఇచ్చే అంశాన్ని పరిశీలించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆక్వా రైతులకు లాభం కలిగేలా ఫిష్ మార్కెటింగ్ పాలసీ రూపకల్పన చేసేందుకు నూతన పాలసీ క్యాబినెట్ ముందుకు తీసుకరానున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ సీమెన్ రెగ్యులేటరీ అథారిటీతోపాటు 3 ప్రాంతీయ విద్యుత్ కార్పొరేషన్లు రెస్కో అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది. ప్రైవేటు హార్టికల్చర్ నర్సరీ పర్యవేక్షణ రెగ్యులేటరీ అథారిటీ ప్రతిపాదనలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, ధర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సన్నద్ధతపైనా చర్చ జరగే అవకాశం ఉంది.
Also Read: Pulichintala: పులిచింతలకు వరద ఉధృతి.. కొట్టుకుపోయిన గేటు.. దిగువ ప్రాంతాల్లో హైఅలర్ట్..
Mid Day Meal: ఆంధ్రప్రదేశ్‌లో ‘మిడ్ డే మీల్’ పథకం కింద 19 వేల కిచెన్లు రెడీ : కేంద్రం