చివరి రోజుకి చేరుకున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
పదమూడు రోజులపాటు కొనసాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. కాగా నేడు ప్రశ్నోత్తరాలకు ఎక్కువ సమయం కేటాయించనున్నారు. ముఖ్యంగా అన్న క్యాంటీన్‌ల మూసివేత, నిరుద్యోగ భృతి, విజయవాడ నుంచి విమాన సర్వీసుల నిలిపివేత, అమరావతిలో మంత్రులు, అధికారుల క్వార్టర్ల నిర్మాణం పురోగతిపై టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తనున్నారు. మరోవైపు ఫైబర్‌గ్రిడ్‌లో అక్రమాలు, ఖరీఫ్‌లో విత్తనాల కొరత, వైద్య కళాశాలల్లో ఫీజులు, వ్యవసాయ రుణాలమాఫీపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తనున్నారు. కాగా, నేడు ఉభయ సభల్లో కాగ్ […]
పదమూడు రోజులపాటు కొనసాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. కాగా నేడు ప్రశ్నోత్తరాలకు ఎక్కువ సమయం కేటాయించనున్నారు. ముఖ్యంగా అన్న క్యాంటీన్‌ల మూసివేత, నిరుద్యోగ భృతి, విజయవాడ నుంచి విమాన సర్వీసుల నిలిపివేత, అమరావతిలో మంత్రులు, అధికారుల క్వార్టర్ల నిర్మాణం పురోగతిపై టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తనున్నారు. మరోవైపు ఫైబర్‌గ్రిడ్‌లో అక్రమాలు, ఖరీఫ్‌లో విత్తనాల కొరత, వైద్య కళాశాలల్లో ఫీజులు, వ్యవసాయ రుణాలమాఫీపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తనున్నారు. కాగా, నేడు ఉభయ సభల్లో కాగ్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇదిలా ఉంటే, ఉదయం 11 గంటలకు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్పందన కార్యక్రమంపై అధికారులతో సీఎం సమీక్షించనున్నారు. అనంతరం వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.