సర్కారు బడులు.. హౌస్ ఫుల్!

|

Jun 26, 2019 | 7:59 AM

పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో 15 వేలు జమచేసేలా ‘అమ్మ ఒడి’ పధకాన్ని అమలు చేస్తామని వైఎస్ జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఆయన ఈ హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలందరికీ ‘అమ్మఒడి’ వర్తింపజేస్తామని అధికారులు కూడా వెల్లడించారు. కాగా ఈ పధకం పేదవర్గాల తల్లిదండ్రులకు ఓ వరం అని […]

సర్కారు బడులు.. హౌస్ ఫుల్!
Follow us on

పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో 15 వేలు జమచేసేలా ‘అమ్మ ఒడి’ పధకాన్ని అమలు చేస్తామని వైఎస్ జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఆయన ఈ హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలందరికీ ‘అమ్మఒడి’ వర్తింపజేస్తామని అధికారులు కూడా వెల్లడించారు. కాగా ఈ పధకం పేదవర్గాల తల్లిదండ్రులకు ఓ వరం అని చెప్పవచ్చు.

మరోవైపు ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ‘అమ్మ ఒడి’ పథకం నేపథ్యంలోనే గతేడాది కంటే ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య భారీగా రెట్టింపు అయిందట. కొన్ని పాఠశాలల్లో అయితే గదులు చాలక ప్రవేశాలను సైతం నిలిపేశారని సమాచారం. మరోవైపు ప్రైవేట్ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడా క్రమంగా తగ్గినట్లు తెలుస్తోంది. దీనికి నిదర్శనం కొన్ని ప్రభుత్వ స్కూళ్లల్లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టడమే అని నిపుణుల అభిప్రాయం.