పోలీసులపై ప్రతీకారం.. అమరావతి వాసులు ఏం చేశారంటే..!

రాజధానిని మార్చొద్దంటూ అమరావతి రైతులు చేస్తోన్న ఆందోళన 27వ రోజుకు చేరింది. రోజు రోజుకు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు రాజధాని ప్రాంత వాసులు. అయితే తమపై అనుచితంగా వ్యవహరిస్తోన్న పోలీసులపై తాజాగా ప్రతీకారం తీర్చుకుంటున్నారు అక్కడి స్థానికులు. తాగేందుకు నీళ్లు ఇచ్చేందుకు కూడా వారు నిరాకరిస్తున్నారు. షాపుల్లోనూ పోలీసులకు క్రయవిక్రయాలు బంద్ చేశారు. అలాగే టీ, టిఫెన్, భోజనాలకు అక్కడి స్థానికులు నో చెబుతున్నారు. ఇక పోలీసులు కూర్చోవడానికి కూడా వీలు లేకుండా ఆయిల్ వస్తువులను […]

పోలీసులపై ప్రతీకారం.. అమరావతి వాసులు ఏం చేశారంటే..!

Edited By:

Updated on: Jan 13, 2020 | 10:24 AM

రాజధానిని మార్చొద్దంటూ అమరావతి రైతులు చేస్తోన్న ఆందోళన 27వ రోజుకు చేరింది. రోజు రోజుకు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు రాజధాని ప్రాంత వాసులు. అయితే తమపై అనుచితంగా వ్యవహరిస్తోన్న పోలీసులపై తాజాగా ప్రతీకారం తీర్చుకుంటున్నారు అక్కడి స్థానికులు. తాగేందుకు నీళ్లు ఇచ్చేందుకు కూడా వారు నిరాకరిస్తున్నారు. షాపుల్లోనూ పోలీసులకు క్రయవిక్రయాలు బంద్ చేశారు. అలాగే టీ, టిఫెన్, భోజనాలకు అక్కడి స్థానికులు నో చెబుతున్నారు. ఇక పోలీసులు కూర్చోవడానికి కూడా వీలు లేకుండా ఆయిల్ వస్తువులను బెంచ్‌లపై పోశారు.

ఇదిలా ఉంటే కాసేపట్లో హైపవర్ కమిటీ సమావేశం కానుంది. తొలి భేటీలో జీఎన్‌రావు, బీసీజీ నివేదికలపై చర్చించిన కమిటీ.. రెండో భేటీలో రైతుల ఆందోళన, డిమాండ్లు, సచివాలయ ఉద్యోగుల పరిస్థితి, 13 జిల్లాల అభివృద్ధి, 3 రాజధానులపై చర్చించింది. ఇక ఇవాళ జరగనున్న మూడో సమావేశంలో ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.