Amaravati Land Scam: రాజధాని భూముల కేసు.. అసైన్డ్‌ భూముల కుంభకోణంలో ఐదుగురు అరెస్టు

Amaravati Land Scam: ఏపీలో రాజధాని భూముల కేసు కొనసాగుతోంది. రాష్ట్రంలో అసైన్డ్‌ భూముల కుంభకోణంలో ఐదుగురు అరెస్టు అయ్యారు. ఈ వ్యవహారంలో కొల్లి శివరాం..

Amaravati Land Scam: రాజధాని భూముల కేసు.. అసైన్డ్‌ భూముల కుంభకోణంలో ఐదుగురు అరెస్టు
Amaravati

Updated on: Sep 13, 2022 | 5:02 PM

Amaravati Land Scam: ఏపీలో రాజధాని భూముల కేసు కొనసాగుతోంది. రాష్ట్రంలో అసైన్డ్‌ భూముల కుంభకోణంలో ఐదుగురు అరెస్టు అయ్యారు. ఈ వ్యవహారంలో కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్‌, విజయసారధి, బడే అంజనేయులు, కొట్టి దొరబాబులను అరెస్టు చేసింది సీఐడీ. 1100 ఎకరాల అసైన్డ్‌ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. 169.27 ఎకరాలకు సంబంధించి ఈ ఐదుగురిని అరెస్టు చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణపై ఆరోపనలుండగా, ఆయన బంధువులు, పరిచయస్తుల పేరుతో బినామీ లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది. వేర్వేరు సర్వే నంబర్లతో 89.8 ఎకరాల భూమిని అక్రమంగా నారాయణ కొనుగోలు చేసినట్లు ఆరోపనలున్నాయి. రామకృష్ణ హౌసింగ్‌ డైరెక్టర్‌ అకౌంట్ల ద్వారా లావాదేవీలు జరిపినట్లు నిర్ధారించింది సీఐడీ. నారాయణ, రామకృష్ణ హౌసింగ్‌ ప్రై.లి మధ్య రూ.15 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తేల్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి