Delhi: జంతర్‌మంతర్‌ దగ్గర ముగిసిన అమరావతి రైతుల ధర్నా.. మద్దతు తెలిపిన పలు పార్టీలు..

|

Dec 17, 2022 | 9:23 PM

దేశరాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర అమరావతి రైతుల ధర్నా ముగిసింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. పలు పార్టీలనేతలు, ప్రజాసంఘాలు రైతులకు సంఘీభావం తెలిపాయి.

Delhi: జంతర్‌మంతర్‌ దగ్గర ముగిసిన అమరావతి రైతుల ధర్నా.. మద్దతు తెలిపిన పలు పార్టీలు..
Amaravati Farmers
Follow us on

దేశరాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర అమరావతి రైతుల ధర్నా ముగిసింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. పలు పార్టీలనేతలు, ప్రజాసంఘాలు రైతులకు సంఘీభావం తెలిపాయి. అమరావతి ఉద్యమాన్ని ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా దేశ రాజధానిలో నిరసన కార్యక్రమం చేపట్టారు రైతులు. రాజధాని అమరావతిలోని ధరణికోట నుంచి ఎర్రకోట పేరుతో ప్రత్యేక రైలులో ఢిల్లీ చేరుకున్న రైతులు..జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా కొనసాగించారు. రైతుల నిరసనకు టీడీపీ,బీజేపీ,జనసేన,సీపీఐ నేతలు మద్దతు పలికారు.

ఢిల్లీ నిరసనతో అమరావతి రాజధాని కొనసాగుతుందనే నమ్మకం కలిగిందన్నారు రైతు నేతలు. పలు పార్టీలనేతలు స్వయంగా వచ్చి మద్దతు తెలపడం సంతోషించదగ్గ విషయమన్నారు.

పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రేపు, ఎల్లుండి వివిధ పార్టీల నేతలను అమరావతి రైతులు కలవనున్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. అమరావతి ప్రాంత రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరిస్తారు. సోమవారం రామ్‌లీలా మైదానంలో జరిగే భారతీయ కిసాన్‌ సంఘ్‌ ర్యాలీలో రైతులు పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..