YS Jagan: కోర్టు వివాదాలు ఉన్నచోట ప్రత్యామ్నాయాలు గుర్తించండి.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

|

Apr 19, 2022 | 8:11 AM

YSR Housing Scheme 2022: ఆంధ్రప్రేదశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల విషయంలో కోర్టు వివాదాలు ఉన్నచోట ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించాలంటూ

YS Jagan: కోర్టు వివాదాలు ఉన్నచోట ప్రత్యామ్నాయాలు గుర్తించండి.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
Cm Ys Jagan
Follow us on

YSR Housing Scheme 2022: ఆంధ్రప్రేదశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల విషయంలో కోర్టు వివాదాలు ఉన్నచోట ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించాలంటూ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. కేసుల పరిష్కారం ఆలస్యమయ్యే సూచనలు ఉంటే ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించే ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం గృహనిర్మాణ శాఖ (AP State Housing Corporation) పై నిర్వహించిన సమీక్షలో ఏపీ సీఎం అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశాఖపట్నంలోని లేఅవుట్లలో భూమిని చదును చేయడంతోపాటు అప్రోచ్‌ రోడ్ల నిర్మాణం, నీళ్లు, విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇళ్లకు ఇచ్చే విద్యుత్ సామగ్రి అత్యంత నాణ్యతతో ఉండాలని.. లేకుంటే తీవ్ర చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ లాంటి కనీస మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలన్నారు. కాలనీల్లో సమగ్ర ప్రణాళిక దృష్ట్యా.. ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టి పూర్తిచేయ్యాలని అధికారులను కోరారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని వినియోగించుకున్న వారికి వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్లు చేయాలన్నారు. దీంతోపాటు టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని.. దీని కోసం మార్గదర్శకాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. పట్టణాలు, నగరాల్లోని 116 నియోజకవర్గాల్లో ఎంఐజీ ప్లాట్ల పథకానికి ముందు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆ తర్వాత మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రణాళిక సిద్ధం చేయాలని.. సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కాగా.. పేదల ఇళ్ల నిర్మాణంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న ప్రజాప్రతినిధులను సత్కరించాలని సమీక్షలో సీఎం నిర్ణయించారు.

ఇదిలాఉంటే.. 5వేలకుపైగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్న చోట నిర్మాణ సామగ్రి కోసం గోదాములు నిర్మిస్తున్నామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. 66 నిర్మించాల్సి ఉండగా.. ఇప్పటికే 47 గోదాముల నిర్మాణం ప్రారంభించామన్నారు. కోర్టు వివాదాలు తీరడంతో విశాఖలో 1.43లక్షల మందికి పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం చేశామన్నారు. ఇది పూర్తికాగానే, వాటికి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు జాన్‌ నాటికి ప్రారంభమవుతాయని.. దాదాపు 63 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి సమాయత్తమవుతున్నామని తెలిపారు. ఎంఐజీ ప్లాట్ల పథకానికి సంబంధించి ఇప్పటికే 41 నియోజకవర్గాల్లో 4,127.5ఎకరాల భూమిని గుర్తించినట్లు తెలిపారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని వినియోగించుకున్న 10.2లక్షల మందిలో 6.15లక్షల మందికి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేశామని.. మిగిలిన వారికీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్‌, అధికారులు పాల్గొన్నారు.

Also Read:

Tirumala: శ్రీవారి ఆలయంలో రోజురోజుకీ పెరుగుతున్న భక్తుల రద్దీ.. సౌకర్యాల కల్పన పై అధికారుల దృష్టి

Andhra Pradesh: అద్భుతం.. సీతారాముల కళ్యాణానికి అతిధిగా వచ్చిన గరుడపక్షి..!