పెళ్లితో దంపతులుగా కొత్త జీవితంలో అడుగు పెట్టె యువతీ యువకుల జీవితానికి నమ్మకమే పునాది.. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో గడపాలని గంపెడాశతో యువతి అత్తారింట్లో అడుగు పెడుతుంది. తనను భర్త బాగా చూసుకుంటాడని రక్త సంబంధాన్ని విడిచి ఎన్నో కలల కోరికలతో జీవితాన్ని గడపడానికి రెడీ అవుతుంది యువతి.. అయితే తాను పెళ్లి చేసుకున్న భర్త ఓ మోసగాడని.. తనకు తెలియకుండానే పెళ్లి మీద పెళ్లి పెళ్లి చేసుకున్నాడని ఆ భార్యకు తెలిస్తే..ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఊహకు కూడా అందనిది.. ఒకరికి తెలియకుండా మరొకరిని, అలా ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, ఏకంగా నలుగురికి పెళ్లి చేసుకున్నాడు ఈ కేటుగాటు. యువతులను మోసం చేస్తూ పెళ్లిళ్లు చేసుకుంటున్న నిత్య పెళ్లికొడుకుపై పోలీసులను ఆశ్రయించింది ఓ బాధితురాలు. ఈ ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
అల్లూరి జిల్లా పాడేరు మండలం సుండ్రు పుట్టులో నిత్య పెళ్ళికొడుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. కొర్రా దామోదర్ అనే వ్యక్తి.. అమ్మాయిని బాగా చూసుకుంటానంటూ నమ్మించి పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు కాపురం చేశాక పుట్టింట్లో దింపేసి వెళ్లిపోతాడు. ఇలా ఇప్పటికే నలుగురు యువతులను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. తన భర్త దామోదర్ పెళ్లిళ్ల విషయం నాలుగో భార్యకు తెలియడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈయనగారి పెళ్లిళ్ల వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ఒకరికి తెలియకుండా మరొకరితో వివాహాలు చేసుకున్న దామోదర్.. తాను తన నాలుగో భార్యతో సన్నిహితంగా ఉన్న వీడియోను తీశాడు. అంతేకాదు ఆ వీడియోని అతని స్నేహితులకు ఫార్వార్డ్ చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. దామోదర్ చేస్తున్న మోసాన్ని గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొర్రా దామోదర్ అరెస్ట్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..