యువకుడి ప్రతిభకు ఫిదా.. అండగా నిలిచిన కలెక్టర్.. కట్ చేస్తే.. అరుదైన ఫీట్ సాధించిన అడవిబిడ్డ..

|

Jun 05, 2022 | 6:34 AM

అందరూ అద్భుతాలు చేయగలరు. వారికి కావాల్సింది కాస్తా ప్రోత్సాహం మాత్రమే. ఓ గిరిజనుడిని కలెక్టర్‌ ఎంకరేజ్‌ చేయడంతో ఎలాంటి వండర్‌ చేశాడో ఇప్పుడు చూద్దాం.

యువకుడి ప్రతిభకు ఫిదా.. అండగా నిలిచిన కలెక్టర్.. కట్ చేస్తే.. అరుదైన ఫీట్ సాధించిన అడవిబిడ్డ..
Alluri District Collector Sumit Kumar
Follow us on

కొద్దిగా ప్రోత్సహం ఉంటే చాలు.. ఎలాంటి అద్భుతాలు చేయడానికైనా యువకులు సిద్ధమంటున్నారు. తాజాగా అల్లూరి జిల్లా హుకుంపేట మండలం అడ్డుమండ గ్రామానికి చెందిన ఆనంద్‌బాబు అనే యువకుడు పర్వతారోహణ అలవర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా వాటర్‌ ర్యాప్‌ లింగ్‌పై మక్కువ పెంచుకుని సాహసాలు చేయడం ప్రారంభించాడు. ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ వాటర్‌ ర్యాప్‌ లింగ్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఔరా అనిపించాడు. దీంతో అతడిలో ఉన్న ప్రతిభను గుర్తించిన జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వెన్నుతట్టి ప్రోత్సహించారు.

తాజాగా ఈనెల 1న ఉత్తరాఖండ్‌లో 14వేల 700 అడుగుల ఎత్తుగల పర్వతాన్ని అధిరోహించి ఆనంద్‌బాబు సత్తా చాటాడు. ఎత్తైన పర్వతంపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. ఈ అరుదైన ఫీట్‌ కూడా కేవలం 1 గంట 40 నిమిషాల వ్యవధిలోనే సాధించాడు. మొత్తం ఐదుగురు సభ్యుల బృందంలో అందరికంటే తక్కువ సమయంలోనే ఆనంద్‌బాబు ఈ ఫీట్‌ సాధించి ఆకట్టుకున్నాడు. తనకు సరైన ప్రోత్సాహం అందిస్తే ఇంకా ఎత్తయిన పర్వతాలను కూడా అధిరోహించగలనని చెబుతున్నాడు.

ఇవి కూడా చదవండి

ఒక్క ఆనంద్‌బాబే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఉత్సాహవంతులైన యువకులు ఉన్నారు. వారికి కొంచెం ప్రోత్సాహం అందిస్తే చాలు అద్భుతాలు చేయగలరు. దానికి ఉదాహరణే ఆనంద్‌బాబు అనే గిరిజనుడి సాహసం. ఆనంద్‌బాబు ఇప్పుడు ఎంతో మంది యువతీ యువకుల్లో స్ఫూర్తిని నింపారనడంలో సందేహం లేదు.