మెడికల్ మాఫియా బుసబుసలు.. అంగట్లో సరుకుల్లా హార్స్ పవర్ గోళీలు.. మామూలు కథ కాదు ఇది..

వయాగ్రా పిల్స్‌ అమ్మకాలపై జంగారెడ్డిగూడెంలో తీగ లాగితే ఉభయగోదావరి జిల్లా అంతటా డొంక కదిలింది. మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ గణేష్‌ను ఆరా తీస్తే... ఏకంగా 30 మెడికల్‌ షాపుల్లో దందా జరుగుతున్నట్టు బయటపడింది. ఆ తరువాత.. ఈ 30 మెడికల్‌ షాపుల్లోనే కాదు గోదావరి జిల్లాల్లో అంతటా ఇదే మాఫియా నడుస్తున్నట్టు తేలింది. విచిత్రం ఏంటంటే..

మెడికల్ మాఫియా బుసబుసలు.. అంగట్లో సరుకుల్లా హార్స్ పవర్ గోళీలు.. మామూలు కథ కాదు ఇది..
Medical Mafia

Updated on: Jul 08, 2025 | 9:45 PM

జంగారెడ్డిగూడెం మెడికల్‌ షాపుల్లో రెగ్యులర్‌ చెకింగ్స్‌ చేస్తున్నారు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు. అక్కడ కనిపించాడో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌.. పేరు గణేష్. అతని మాటల్లో ఏదో తేడా. కాస్త అనుమానంగా అనిపించే సరికి ఆరా తీశారు, ఫోన్ చెక్‌ చేశారు. అప్పుడు బయటపడింది.. అక్కడ ఎంత పెద్ద దందా జరుగుతోందో..! గోదావరి జిల్లాల యువతను వయాగ్రాకు బానిసలుగా మార్చుతున్న దందా అది. యువతులకు అబార్షన్‌ కిట్స్‌ అంటగడుతూ వారి జీవితాలను నాశనం చేస్తున్న వ్యాపారం అది. జనరల్‌గా అప్పటికి అది చిన్న వార్తే. కాని, అందులోని సీరియస్‌నెస్‌ ఎంతో తెలుసు కాబట్టి వరుస కథనాలు ప్రసారం చేసింది టీవీ9. అధికారులు రైడ్స్‌ మొదలుపెట్టారు. ఉభయ గోదావరి జిల్లాల్లో, అక్కడి సిటీల్లో, చిన్న పట్టణాల్లో, చివరకు పల్లెటూళ్లలో సైతం… వయాగ్రా, అబార్షన్‌ కిట్స్‌ ఇష్టారీతిన అమ్ముతున్నట్టు బయటపడుతోంది. గోదావరి జిల్లాలకంటూ ఓ పేరుంది. జనరల్‌గా… సంక్రాంతి రెండు తెలుగు రాష్ట్రాలకూ పెద్ద పండగే. కాని, సంక్రాంతి సందళ్లకు కేరాఫ్‌ మాత్రం గోదావరి జిల్లాలే. పండగ జరిగేది మూడు రోజులే అయినా.. నెలంతా సందడి కనిపిస్తుందంటే కారణం.. ఒకవిధంగా గోదావరి జిల్లాల్లో జరిగే ఆ కోలాహలమే. నెల రోజుల ముందే బరులు గీసి కోడిపుంజులను సిద్ధం చేస్తారు. ఒక్క కోడిపందేలప్పుడే 2వేల కోట్ల రూపాయలకు పైగా చేతులు మారతాయని అంచనా. అందునా.. ఈ లెక్క అంతా ఒక్క ఉభయ గోదావరి జిల్లాల్లోనే. ఓవైపు పుంజులను బరిలో దింపుతూనే.. మరోవైపు మద్యం,...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి