
తిరుమల ఆలయంలో కల్తీ నెయ్యి వివాదం కంటిన్యూ అవుతుండగానే డిక్లరేషన్ వ్యవహారం మరో రచ్చకు దారితీసింది. మాజీ సిఎం జగన్ తిరుమలకు రానుండటంతో డిక్లరేషన్ రాద్ధాంతానికి తెర తీసింది. తిరుమల వెంకన్నపై నమ్మకం విశ్వాసం ఉంటేనే రావాలని అధికార పక్షాలు టీడీపీ, జనసేన, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు జగన్ కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. అన్యమతస్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలన్న టీటీడీ నిబంధనను వైఎస్ జగన్ గౌరవించాలని అటు స్వామీజీలు, హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. డిక్లరేషన్ ఇవ్వలేదంటే జగన్‌ను అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తోంది. దీంతో మరోసారి తిరుమల కొండపై డిక్లరేషన్ వ్యవహారం కొండంత చర్చకు దారి తీస్తోంది. తిరుమలకు సంబంధించిన కీలక అంశాలపై ఇప్పుడు కొండంత వివాదం నెలకొంటున్నాయి. శ్రీవారి లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ వివాదం చల్లారక ముందే ఇప్పుడు డిక్లరేషన్ వ్యవహారం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. అసలు తిరుమల శ్రీవారి ఆలయంలో డిక్లరేషన్ వ్యవహారం ఏంటి…? అన్యమతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనా…? ఈ చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య భక్తుల మధ్య కూడా హాట్ టాపిక్ అయ్యింది. Jagan Tirumala Visit ఆంగ్లేయుల కాలం నుంచే డిక్లరేషన్.. తిరుమల వెంకన్న దర్శనం కోసం కొండకు వచ్చే హిందూయేతరులు వైకుంఠం వద్ద డిక్లరేషన్ సమర్పించాలన్న నిబంధన ఎప్పటి నుంచో ఉంది. ఆంగ్లేయుల పాలన...