AP News: డిసెంబర్ వరకే డెడ్‌లైన్.. హామీలను నెరవేర్చండి.. అగ్రిగోల్డ్ బాధితుల డిమాండ్..

|

Sep 07, 2022 | 8:52 AM

డిసెంబర్‌ వరకు ఒకలెక్క ఆ తర్వాత ఇంకో లెక్కంటూ అల్టిమేట్ జారీ చేశారు అగ్రిగోల్డ్ బాధితులు..ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ విజయవాడలో ధర్నా చేపట్టారు.

AP News: డిసెంబర్ వరకే డెడ్‌లైన్.. హామీలను నెరవేర్చండి.. అగ్రిగోల్డ్ బాధితుల డిమాండ్..
Agrigold Victims
Follow us on

Agrigold Victims Protest in Vijayawada: అగ్రిగోల్డ్‌ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. తమకిచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలంటూ విజయవాడలో ధర్నా చేపట్టారు.ఆగ్రిగోల్డ్‌ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆక్రందన సభ చేపట్టారు.. పెద్ద సంఖ్యలో అగ్రిగోల్డ్‌ బాధితులు ధర్నా చౌక్‌కు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుడారాలు, టెంట్లు వేసి పెద్ద సంఖ్యలో బాధితులు ధర్నా పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి విజయవాడకు తరలివచ్చిన బాధితులు ధర్నా చౌక్‌లో బైఠాయించారు. డిసెంబర్ వరకు ఒక లెక్క అది దాటితే ఇంకో లెక్క అంటూ ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు పరచడంలో ఎందుకు తాత్సారం జరుగుతుందో జవాబు చెప్పాలని నిలదీశారు.బాధితులు చనిపోతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదని అగ్రిగోల్డ్ బాధితులు ఆరోపించారు.

ఇచ్చిన హామీ ప్రకారం చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు 10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు విభజన హామీల సాధన సమితి కన్వీనర్‌ చలసాని.. అగ్రిగోల్డ్ బాధితుల తరపున పోరాడుతున్న సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వర్రావు బాధితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. డిసెంబర్‌ వరకు డెడ్‌లైన్‌ పెడుతున్నామని, లేదంటే సీపీఐ తరపున పోరాటం చేస్తామంటూ ఆయన హెచ్చరించారు.

అగ్రిగోల్డ్‌ సంస్థ మోసానికి గురైన బాధితులంతా న్యాయం కోసం ఆందోళనకు దిగారు. అగ్రిగోల్డ్‌లో తమ డిపాజిట్లు పెట్టి మోసపోయామని..ఈ కారణంగా తమ అమ్మాయిల వివాహాలు జరిపించలేని దుస్థితిలో ఉన్నామని, ఇకనైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని తమను ఆర్థికంగా ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..