Konaseema: అఘోరాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత ‘అఖండ’ లెవల్ లో వారు ఎలా క్లాస్ పీకారో చూడండి

|

Jan 22, 2022 | 7:49 PM

భారతదేశంలోని హిందూ సమాజం అఘోరాలను అత్యంత పవిత్రంగా కొలుస్తారు. అఘోరాలు ప్రధానంగా శివభక్తులు. అఘోరీ అంటే సంస్కృతంలో 'భయం కలిగించని' అన్న అర్థం ఉంది.

Konaseema: అఘోరాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత అఖండ లెవల్ లో వారు ఎలా క్లాస్ పీకారో చూడండి
అఘోరాలు
Follow us on

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో అఘోరాలు హల్ చల్ చేశారు. పి.గన్నవరం మండలం ముంగండ పరిసర ప్రాంతాల్లో గత మూడు రోజులుగా తిరుగుతున్న నలుగురు అఘోరా సాధువులు కలియ తిరుగుతున్నారు. అఘోరాలు  అనుమానాస్పదంగా తిరగడంతో భయాందోళన చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే తాము యాత్రలో భాగంగా కాశీ నుంచి వచ్చామని  సాధువులు పోలీసులకు తెలిపారు. వారి వద్ద ఉన్న బ్యాగులను పోలీసులు చెక్ చేశారు. ఆ సమయంలో అఘోరాలు  హిందీ మాట్లాడుతూ కనిపించారు. వారు చెప్పిన వివరాలను నోట్ చేసుకున్న పోలీసులు.. నమ్మకం కుదరడంతో తిరిగి పంపించివేశారు.

 

కాగా భారతదేశంలోని హిందూ సమాజం అఘోరాలను అత్యంత పవిత్రంగా కొలుస్తారు. అఘోరాలు ప్రధానంగా శివభక్తులు. అఘోరీ అంటే సంస్కృతంలో ‘భయం కలిగించని’ అన్న అర్థం ఉంది. అయితే అందుకు భిన్నంగా వీరి జీవనశైలి,  వేషధారణ, అసాధారణ ఆచారవ్యవహారాలు భీతిగొలుపుతాయి. అఘోరాలు కాలుతున్న శవాల మధ్య కాలం గడుపుతుంటారు. శరీరమంతా బూడిద రాసుకుని, మనుషుల పుర్రెలను చేతపట్టుకుని తిరుగుతుంటారు. గంజాయి తాగుతూ నగ్నంగా సంచరిస్తుంటారు.

Also Read: Brahma kamalam: బిక్కవోలులో ఒకే మొక్కకు 80 బ్రహ్మ కమలాలు.. ప్రత్యేకతలివే, చూసేందుకు వస్తున్న జనం