Andhra Pradesh: వాలంటీర్ హత్య కేసులో కీలక మలుపు.. నిందితుడు పద్మారావు ఆత్మహత్య

|

May 19, 2022 | 11:13 AM

వాలంటీర్ శారద హత్య కేసులో నిందితుడిగా ఉన్న పద్మారావు ఆత్మహత్య చేసుకున్నాడు. పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు (Nidubrolu) రైల్వేస్టేషన్‌లో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున మూడు గంటల....

Andhra Pradesh: వాలంటీర్ హత్య కేసులో కీలక మలుపు.. నిందితుడు పద్మారావు ఆత్మహత్య
Nidubrolu
Follow us on

వాలంటీర్ శారద హత్య కేసులో నిందితుడిగా ఉన్న పద్మారావు ఆత్మహత్య చేసుకున్నాడు. పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు (Nidubrolu) రైల్వేస్టేషన్‌లో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మృతుడి జేబులో ఉన్న వివరాల ఆధారంగా పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న కుటుంబీకులు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పద్మారావుగా గుర్తించారు. వాలంటీర్‌ హత్యకు సంబంధించి మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. చుండూరు మండలంలోని చావలి గ్రామానికి చెందిన దొప్పలపూడి శారద.. గ్రామ వాలంటీర్ గా విధులు నిర్వహిస్తోంది. ఆమెకు అదే గ్రామానికి చెందిన పద్మారావుతో వివాహేతర సంబంధం సాగుతోంది. ఈ విషయంపై పలుమార్లు భర్తతో కూడా గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే శారద పద్మారావును దూరం పెట్టింది. అయినా పద్మారావు శారదను తనతో కలిసి ఉండాలని తరుచూ వేధించేవాడు. ఆమె తిరస్కరించడంతో శారదపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా చంపేయాలని కుట్ర పన్నాడు.

ఈ నేపథ్యంలో సాయంత్రం సమయంలో శారద తన ఇల్లు శుభ్రం చేస్తుండగా పద్మారావు శారదను కత్తితో మెడపై పలుమార్లు నరికాడు. శారద చెయ్యి, మెడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అతడి దాడి నుంచి తప్పించుకునే క్రమంలో కొంత దూరం వెళ్ళిన శారద తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకుని రిమాండ్ పంపిస్తామని తెలిపారు. హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించిన ఆయన.. దీంట్లో ఎటువంటి రాజకీయ కోణాలు లేవని, కేవలం వివాహేతర సంబంధం నేపథ్యంలో మాత్రమే హత్య జరిగిందని వెల్లడించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో పద్మారావు ఆత్మహత్య చేసుకోకడం సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Stock Market: భారీగా పతనమైన దేశీయ మార్కెట్‌ సూచీలు.. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

Online Games GST: ఆన్‌లైన్‌ గేమ్స్‌ నిర్వాహకులకు భారీ షాక్‌.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..