Kurnool District: కర్నూలు జిల్లాలో పాల వ్యాను బోల్తా.. జనాలు చూడండి ఎలా ఎగబడి వచ్చారో

|

Jul 22, 2021 | 5:01 PM

మ‌నుషుల్లో విలువ‌లు, మాన‌వత్వం ఏ రేంజ్ కు ప‌డిపోయాయో చెప్ప‌డానికి ఈ ఘ‌ట‌న‌ను ఉదాహార‌ణ‌గా తీసుకోవ‌చ్చు. ఎవరికైనా రోడ్డుపై యాక్సిడెంట్‌ జరిగితే..

Kurnool District: కర్నూలు జిల్లాలో పాల వ్యాను బోల్తా.. జనాలు చూడండి ఎలా ఎగబడి వచ్చారో
Milk Theft
Follow us on

మ‌నుషుల్లో విలువ‌లు, మాన‌వత్వం ఏ రేంజ్ కు ప‌డిపోయాయో చెప్ప‌డానికి ఈ ఘ‌ట‌న‌ను ఉదాహార‌ణ‌గా తీసుకోవ‌చ్చు. ఎవరికైనా రోడ్డుపై యాక్సిడెంట్‌ జరిగితే.. అటుగా వెళ్తున్న‌వారు క్ష‌త‌గాత్రుల‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించడమో లేక పోలీసులకు సమాచారం ఇవ్వడమో చేస్తుంటారు. లేదా కుదిరినంతలో ఫస్ట్ ఎయిడ్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం ఓ యాక్సిడెంట్‌ దుర్ఘటనను లూఠీకీ ఉపయోగించుకున్నారు స్థానికులు. పాలవ్యాన్‌ బోల్తా పడటంతో.. ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాల వాళ్లు ఎగబడి వచ్చేశారు. సాయం చేసేందుకు మాత్రం కాదండోయ్. పాలను బిందెలు, బకెట్లలో పట్టుకుని తమ ఇళ్లకు తీసుకెళ్లేందుకు.  ఈ ఘటన కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తిపాడు వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో పాలవ్యాన్‌ డ్రైవర్‌, క్లీనర్‌ ఎలా ఉన్నారో కూడా ఎవరూ పట్టించుకోకుండా పాల కోసం ఎగబడ్డారు.  ఆటోలలో వెళ్లే ప్రయాణీకులు కూడా ప్రమాదస్థలి వద్ద ఆగి.. తమ వద్ద ఉన్న బాటిళ్లలో పాలను నింపుకున్నారు. నీటి ఎద్దడి ఉన్న బస్తీలలో నాలా నీళ్ల కోసం ఎగబడ్డట్టుగానే ఇక్కడ పాల కోసం జనం పరుగులు తీశారు. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న కొంత మంది స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. కరోనా మ‌నుషుల‌కు చాలా పాఠాలు నేర్పింద‌ని భావించాం.. కానీ మ‌నుషుల్లోని ఈ క‌క్కుర్తిని మాత్రం దూరం చేయ‌లేక‌పోయింద‌ని ఈ ఉదంతంలో అర్థ‌మైంది.

 

 

Also Read: వానొచ్చె, వరదలు తెచ్చె.. రోడ్లపైనే చేపల వేట.. ఒక్కోటి కిలోకు పైనే

ఆకాశానికి చిల్లు పడినట్లుగా వాన.. వాగులో కొట్టుకుపోయిన ఆటో.. షాకింగ్ విజువల్స్..