విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. లాడిల్ తెగి 20 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు.. నలుగురికి తీవ్ర గాయాలు

|

Dec 18, 2020 | 10:27 PM

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. లాడిల్ తెగి 20 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలయింది. నలుగురు కార్మికులకు

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. లాడిల్ తెగి 20 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు.. నలుగురికి తీవ్ర గాయాలు
Follow us on

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. లాడిల్ తెగి 20 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలయింది. నలుగురు కార్మికులకు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్ 2లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులు శోభన్‌ బాబు, పైడం నాయుడు, శ్రీనివాస్, మోహన్‌గా గుర్తించారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. కార్మికులు అలెర్ట్‌గా ఉండకపోవడం, పర్యవేక్షణ సరిగా లేనందున ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. అయితే అవగాహన లోపం కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో తరచూ ప్రమాదాలు జరుగుతుండటం అందరిని కలవర పెడుతోంది.