ACB Raids: ఏసీబీ వలలో పాకాల సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు

|

Jun 04, 2021 | 5:09 PM

ACB Raids : చిత్తూరు జిల్లాలోని ఓ సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం  పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ స్థలం మార్ట్ గేజ్ రిజిస్ట్రేషన్ కు రూ.1.50 లక్షల నగదును పాకాలకు చెందిన సబ్ రిజిస్ట్రార్ దామోదరం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుల నుంచి నగదు తీసుకున్న సబ్ రిజిస్ట్రార్ దామోదరం డాక్యుమెంట్ రైటర్ రాంబాబుకు […]

ACB Raids: ఏసీబీ వలలో పాకాల సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు
Acb Raids
Follow us on
ACB Raids : చిత్తూరు జిల్లాలోని ఓ సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం  పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఓ స్థలం మార్ట్ గేజ్ రిజిస్ట్రేషన్ కు రూ.1.50 లక్షల నగదును పాకాలకు చెందిన సబ్ రిజిస్ట్రార్ దామోదరం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుల నుంచి నగదు తీసుకున్న సబ్ రిజిస్ట్రార్ దామోదరం డాక్యుమెంట్ రైటర్ రాంబాబుకు ఇచ్చి దాచమని ఇచ్చాడు. అప్పటికే బాధితుల పిర్యాదు మేరకు కాపు కాచిన ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు అల్లా భక్ష్, జనార్ధన నాయుడు ఇచ్చిన సమాచారం మేరకు.. నాని ప్రసాద్ నుంచి యల్లా దామోదర్ ప్రసాద్ రూ.46 లక్షల నగదును అప్పుగా తీసుకున్నారు. ఇందుకు గాను దామోదర్ ప్రసాద్ పూతలపట్టు మండలం పేట మిట్టవద్ద ఉన్న తన 6.50 ఎకరాల మామిడి తోటను నాని ప్రసాద్ కు మార్ట్ గేజ్ చేసేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ ను సంప్రదించగా రూ.1.50 లక్షల నగదును డిమాండ్ చేశారని తెలిపారు. ఈ క్రమంలో బాధితులు తమను ఆశ్రయించారని ఏసీబీ అధికారులు తెలియజేశారు. అవినీతికి పాల్పడ్డ సబ్ రిజిస్ట్రార్ ను అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.
Also Read: గాయపడిన బొద్దింకను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిన ఓ వ్యక్తి.. డబ్బులు తీసుకోకుండా వైద్యం చేసిన డాక్టర్