Andhra Pradesh: పక్షులంటే ఎంత ప్రేమో.. పండించిన పంటంతా వాటి కోసమే.. ఈ యువకుడి స్టోరీ వింటే వావ్ అనాల్సిందే..
అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారు. అలాంటిది ఆహారం కావాలని నోరు తెరిచి అడగలేని పక్షులకు ఆహారం అందిస్తున్నాడు ఓ పక్షి ప్రేమికుడు. ప్రకృతిలో అవి కూడా భాగమేనని, మనుషులతో సమానంగానే..
అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారు. అలాంటిది ఆహారం కావాలని నోరు తెరిచి అడగలేని పక్షులకు ఆహారం అందిస్తున్నాడు ఓ పక్షి ప్రేమికుడు. ప్రకృతిలో అవి కూడా భాగమేనని, మనుషులతో సమానంగానే వాటికి కూడా అన్ని రకాల హక్కులు ఉన్నాయనే విషయాన్ని గ్రహించాడు ఓ వ్యక్తి. పురుగుల మందుల వాడకం, కాలుష్యం పెరిగిపోతుండటం, వాతావరణంలో మార్పుల కారణంగా కొన్ని రకాల పక్షి జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. వాటికి ఆహారం కూడా లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిని గమనించిన ఓ వ్యక్కి.. తన సొంత పొలంలో పక్షుల కోసం ప్రత్యేకంగా పంటనే సాగు చేస్తున్నాడు. వాటి ఆకలి తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ బర్డ్స్ లవర్ పై tv9 ప్రత్యేక కథనం.. పక్షులు తమ కిలకిలరావాలతో మనకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. అంతేకాదు మనిషి హాయిగా బ్రతకాలన్నా. ప్రకృతిని సమతౌల్యంగా ఉండాలన్నా పక్షులు చాలా కీలకం.ప్రస్తుత సమాజంలో పక్షులు కనుమరుగవుతున్నాయి. రేడియేషన్ పవర్ తో పక్షులు మరనిస్తుండగా,ఉన్న కొద్ది పక్షులు సరైన ఆహారం లేక మృత్యువాతపడుతున్నాయి.
పక్షి ప్రేమికులు అక్కడ అక్కడ పక్షులను సంరక్షణ కోసం వారి వంతు సహాయ సహకారాలు చేస్తున్నారు. అలాంటి వారిలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామానికి చెందిన దేవదాసు ఒకరు. దేవదాసు పక్షి ప్రేమికుడు. అంతరించిపోతున్న పక్షులను సంరక్షించాలన్న ఉద్దేశంతో ఈ తన వంతు సహకారం అందిస్తున్నాడు. ఊరిలో అంత పత్తి, వరి పంటనే సాగు చేస్తుండడంతో పక్షులకు గింజలు దొరకడం కష్టం గా మారడంతో, దేవదాసు తనకున్న అర్ధ ఎకరా పొలంలో పక్షుల కోసం ప్రత్యేకంగా సజ్జ పంటను సాగు చేస్తూ వాటి ఆకలి తీరుస్తున్నాడు.
మనిషికి మనిషి సహాయ పడని ఈ రోజుల్లో మూగ జీవాల సంరక్షణకు పాటు పడుతున్న పక్షి ప్రేమికుడు దేవదాసు ను అందరూ మెచ్చుకుంటున్నారు. అతను చేస్తున్న ప్రయత్నానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..