సాయంత్రం స్నేహితులతో సరదాగా గడిపాడు, ఉదయానికి కిటికీకి వేలాడుతూ కనిపించాడు.

| Edited By: Narender Vaitla

Jan 12, 2024 | 7:36 PM

అయితే ఉదయం లేచి చూసే సరికి అంతా షాక్‌కి గురయ్యారు. స్థానికంగా ఉన్న డిగ్రీ కాలేజ్ సమీపంలో ఓ ఇంటి వెనుక కిటికీకి వేలాడుతూ కనిపించాడు. యువకుడి మృతి ప్రస్తుతం మిస్టరీగా మారింది. అనకాపల్లి జిల్లా చోడవరంలో యువకుడు అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది...

సాయంత్రం స్నేహితులతో సరదాగా గడిపాడు, ఉదయానికి కిటికీకి వేలాడుతూ కనిపించాడు.
Andhra Pradesh
Follow us on

అనకాపల్లిలో దారుణం జరిగింది. సాయంత్రం స్నేహితులతో సరదాగా గడిపిన యువకుడు ఉదయం లేచే సరికి శవమై కనిపించాడు. ముందురోజు సాయంత్రం సరదాగా స్నేహితులతో కలిసి షాపింగ్‌కు వెళ్లాడు. మార్గ మధ్యలో ఆగి.. స్నేహితులను ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పాడు, రాత్రి గడిచింది.

అయితే ఉదయం లేచి చూసే సరికి అంతా షాక్‌కి గురయ్యారు. స్థానికంగా ఉన్న డిగ్రీ కాలేజ్ సమీపంలో ఓ ఇంటి వెనుక కిటికీకి వేలాడుతూ కనిపించాడు. యువకుడి మృతి ప్రస్తుతం మిస్టరీగా మారింది. అనకాపల్లి జిల్లా చోడవరంలో యువకుడు అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. డిగ్రీ కాలేజ్ సమీపంలో ఓ ఇంటి వెనుక కిటికీకి వేలాడుతున్నట్టు ప్రశాంత్ మృతదేహం కనిపించడంతో.. అనుమాన్నాస్పద కేసు నమోదు చేసి.. ఆత్మహత్య? హత్య? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పత్తి ప్రశాంత్ (24) బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో నివాసం ఉంటూ, ఓ కూరగాయల దుకాణంలో పనిచేస్తున్నాడు. బుధవారం రోజుర స్నేహితులతో కలిసి పండుగ షాపింగ్‌కు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో చోడవరంలో అదే రోజు రాత్రి ఆగి.. స్నేహితులను ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పాడు. ఆ రాత్రిక ఏం జరిగిందో ఏమో కానీ… గురువారం తెల్లారేసరికి శవమై కనిపించాడు.

చోడవరం కాలేజీ సమీపంలోని విగత జీవిగా ఓ ఇంటి వెనుక కిటికీకి వేలాడుతూ కనిపించాడు ప్రశాంత్‌. అవాక్కయిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందిచ్చారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. చోడవరం సిఐ శ్రీనివాస్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. స్నేహితులతో వెళ్లిన ప్రశాంత్.. ఎలా మరణించాడన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ప్రశాంత్ మృతి వెనుక అసలు కారణం తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..