
పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. కొంతమంది వయసు రాగానే పెళ్లి పీటలెక్కే్స్తారు. మరికొందరు ఉద్యోగం వచ్చాక, డబ్బులు సంపాదించాక చేసుకుందామని ఆగుతారు. ఒకప్పుడు 25 ఏళ్ల లోపే పెళ్లిల్లు చేసుకునేవారు. ఈ కాలంలో మాత్రం 30 దాటిన తర్వాత కూడా వివాహాలు చేసుకోవడానికి వెనకాడటం లేదు. అయితే కొంతమంది మాత్రం ఇంకా పెళ్లి అవ్వడం లేదని నిరాశలోకి వెళ్లిపోతుంటారు. తాజాగా ఓ యువకుడు తనకు పెళ్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం సన్యాసపాలెం గ్రామంలో మురళీ అనే యువకుడు ఉండేవాడు. అయితే అతనికి 37 ఏళ్లు వచ్చాక కూడా ఇంతవరకు వివాహం కాలేదు. ఇక తనకు పెళ్లి కాదనే బాధతో మురళీ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. మనస్తాపంతో గడ్డిమందు తాగాడు. విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు హుటాహుటీనా ఆసుపత్రికి తరలించారు. అయితే మురళీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే మృతి చెందడం అతని కుటుంబ సభ్యుల్లో విషాదం నింపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..