కట్టుకున్న భర్తను వదిలేసిన ఓ యువతి మరో యువకుడితో ప్రేమయాణం సాగించింది. గంజాయి, డ్రగ్స్‌కు బానిసలైన ఆ జంట, మత్తులో మునిగితేలారు. చివరికి తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ తన అన్న, స్నేహితులతో కలసి ప్రియుడిని చంపించేసింది. హత్య చేయడమే కాకుండా, అది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఒక్క ఫోన్ కాల్ ఆముగ్గరిని పోలీసులకు పట్టించింది.
ఈ గంజాయి మత్తు హత్యా ప్రేమ కథాచిత్రమ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలుగుచూసింది. మలికిపురం మండలం గుడిమెళ్ళంకు చెందిన రాపాక ప్రశాంతికి గత సంవత్సరం డిసెంబర్‌లో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే భర్తను వదిలేసిన ప్రశాంతి, మలికిపురం గ్రామానికి చెందిన పడమటి నోయల్ జార్జ్ తో ప్రేమాయణం సాగించింది. తన తండ్రి జాబ్ నిమిత్తం కాకినాడలో ఉండే జార్జ్, మలికిపురంలోని తన ఇంటి వస్తూ ప్రశాంతితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నే నోయల్ జార్జ్, ప్రశాంతి ఇద్దరూ గంజాయి, డ్రగ్స్ ఇంజక్షన్లకు బానిసలయ్యారు. ఇదే ఇద్దరిని మరింత దగ్గర చేసింది. భర్తతో విడిపోయిన ప్రశాంతి, గత డిసెంబర్ నుండి జార్జ్‌తో సహజీవనం మొదలుపెట్టింది.
ఇదిలావుండగా, ఇటీవల ప్రశాంతికి జార్జ్ నుంచి వేధింపులు మొదలయ్యాయి. గంజాయి, డ్రగ్స్ మత్తులో నోయల్ జార్జ్ తనను చిత్ర హింసలకు గురిచేస్తూ హింసిస్తున్నాడని తన అన్న ప్రకాష్‌కు చెప్పింది ప్రశాంతి. చెల్లిని హింసిస్తున్నాడని కోపంతో రగిలిపోయిన ప్రకాష్ నోయల్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రశాంతితో కలిసి పక్కా ఫ్లాన్ వేసి జార్జ్‌ను రప్పించి హతమార్చారు.
ప్రశాంతితో నోయల్ జార్జ్‌కు ఫోన్ చేయించాడు ప్రకాష్. ప్రశాంతి వద్దకు రప్పించారు. అప్పటికే నోయల్ హత్యకు పధకం వేసుకున్న రాపాక ప్రశాంతి, రాపాక ప్రకాష్, అతని స్నేహితుడు ఎర్రంశెట్డి ప్రేమ్ కుమార్ ముగ్గురు కలసి నోయల్ జార్జ్ పై ఇనుప రాడ్లతో దాడి చేశారు. గాయాలతో పారిపోతున్న నోయల్ ను వెంటపడి మరోసారి కొట్టారు. కొనఊపిరితో ఉన్న అతన్ని దిండి-చించినాడ బ్రిడ్జి పై నుండి గోదావరిలోకి తోసేశారు. అంతే కాకుండా నోయల్ జార్జ్ బైక్, చెప్పులు బ్రిడ్జి వద్ద ఉంచి, ఆత్మహత్య గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ముగ్గురు నిందితులు అక్కడి నుండి పారిపోయిన ముగ్గురు నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
నోయల్ జార్జ్ తనను హింసించి కొట్టి పారిపోయాడంటూ పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది ప్రశాంతి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇనుప రాడ్ల దాడిలో గాయపడి పారియే సమయంలో నోయల్ జార్జ్ తన తండ్రి కి కాల్ చేసి ప్రమాదంలో ఉన్నానంటూ సమాచారం ఇచ్చాడు. ఈ ఘటన తరువాత రోజు నోయల్ జార్జ్ తండ్రి రత్నరాజు మలికిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు పోలీసులు. అయితే హత్య జరిగిన రెండు రోజులకు సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం సముద్ర తీరంలో నోయల్ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు, నోయల్ శరీరంపై ఉన్న గాయాలు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దీంతో మర్డర్ కేసుగా నమోదు చేసి, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..