పెళ్లి బంధంతో ఒక్కటైన సీమ చిన్నది, అమెరికా కుర్రోడు

|

May 10, 2019 | 4:37 PM

ప్రేమ అనేది ఒక మ్యాజిక్..అది ఎవరి హృదయంలో ఎప్పుడు..ఎలా మొదలవుతుందో చెప్పలేం. నిజమైన ప్రేమకు కులం, మతం, జాతి, సరిహద్దు బేధాలు ఉండవ్. అలానే ఓ అమెరికా అబ్బాయి, ఆంధ్రా అమ్మాయి ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ యువ జంట నాలుగేళ్ల పాటు కలసి చదువుకొని ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి… ఖండాంతరాలు దాటి వచ్చి చిత్తూరులో హిందూ సంప్రదాయ ప్రకారం వివాహం చేసుకున్నారు. చిత్తూరుకు చెందిన సుధాకర్ నాయుడు, కమలల ముద్దుల కుమార్తె […]

పెళ్లి బంధంతో ఒక్కటైన సీమ చిన్నది, అమెరికా కుర్రోడు
Follow us on

ప్రేమ అనేది ఒక మ్యాజిక్..అది ఎవరి హృదయంలో ఎప్పుడు..ఎలా మొదలవుతుందో చెప్పలేం. నిజమైన ప్రేమకు కులం, మతం, జాతి, సరిహద్దు బేధాలు ఉండవ్. అలానే ఓ అమెరికా అబ్బాయి, ఆంధ్రా అమ్మాయి ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ యువ జంట నాలుగేళ్ల పాటు కలసి చదువుకొని ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి… ఖండాంతరాలు దాటి వచ్చి చిత్తూరులో హిందూ సంప్రదాయ ప్రకారం వివాహం చేసుకున్నారు. చిత్తూరుకు చెందిన సుధాకర్ నాయుడు, కమలల ముద్దుల కుమార్తె నిషా, 2013లో బిటెక్ పూర్తి చేసి.. అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీలో ఎంటెక్ చదువుకోడానికి వెళ్ళింది. యూనివర్సిటీలో తనతో పాటే చదువుకుంటున్న ఆండ్రూ గ్రీనరీతో ప్రేమలో పడింది. తన ప్రేమ విషయం చెప్పి.. తల్లిదండ్రులను ఒప్పించింది. అండ్రూ పేరెంట్స్ కూడా ఈ పెళ్లికి ఓకే అనడంతో.. గురువారం చిత్తూరులోని ఒక హోటల్లో హిందూ సంప్రదాయంలో అమెరికా అబ్బాయి, ఆంధ్రా అమ్మాయి ఒక్కటయ్యారు.