AP News: ఏపీలో రక్తం మోడిన రహదారులు.. పలు ప్రమాదాల్లో ఆరుగురు మృతి, 15 మందికి గాయాలు..

|

Feb 11, 2022 | 4:54 PM

AP News: ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం రహదారులు రక్తమోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు మరణించగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. అతివేగం, నిర్లక్ష్యం, వాతావరణం సహకరించకపోవడం ఇలా రకరకాల కారణాలతో పలువరు మృత్యువాత పడ్డారు...

AP News: ఏపీలో రక్తం మోడిన రహదారులు.. పలు ప్రమాదాల్లో ఆరుగురు మృతి, 15 మందికి గాయాలు..
Accident
Follow us on

AP News: ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం రహదారులు రక్తమోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు మరణించగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. అతివేగం, నిర్లక్ష్యం, వాతావరణం సహకరించకపోవడం ఇలా రకరకాల కారణాలతో పలువరు మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరులో శుక్రవారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన లారీ, ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది.

ప్రమాద సమయంలో లారీ వేగంతో ఉండడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. సంఘటన జరిగే సమయానికి మంచు ఎక్కువగా ఉండడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే దామగట్ల వద్ద ఆర్టీసీ బస్సు-కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు చనిపోగా, 15 మందికి గాయాలయ్యాయి. ఇక ఆత్మకూరు-నందికొట్కూరు సమీపంలో బైక్‌పై వెళ్తోన్న వ్యక్తి అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

తప్పిన పెను ప్రమాదం..

కృష్ణా జిల్లాలో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. కైకలూరు మండలం సింగాపురం వద్ద ఏలూరు నుంచి భీమవరం వెళుతోన్న ఆర్టీసీ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో ఏకంగా 48 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎదురుగా వచ్చిన బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పడంతో బస్సు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే అదృష్ట వశాత్తు ప్రయాణికులకు ఎలాంటి హాని జరగలేదు. బస్సులోని 48 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.

Also Read: ICAI CA May Exam 2022: సీఏ మే – 2022 పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఈ తేదీల్లోనే పరీక్షలు…

IPL 2022 Auction: మెగా వేలంలో ఈ ముగ్గురిపై కన్నేసిన రాజస్థాన్ రాయల్స్.. వారెవరంటే?

Viral Video: ‘అసలు బుద్ధుందా’..? చీర కోసం బిడ్డ ప్రాణాన్ని పణంగా పెట్టాలా..?