Eklavya Schools: ఆంధ్రప్రదేశ్‌కు 28 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ళు మంజూరయ్యాయి : కేంద్రమంత్రి రేణుక సింగ్‌

|

Jul 29, 2021 | 9:33 PM

ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 28 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ళు మంజూరైనట్లు గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్‌ తెలిపారు. రాజ్యసభలో..

Eklavya Schools: ఆంధ్రప్రదేశ్‌కు 28 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ళు మంజూరయ్యాయి : కేంద్రమంత్రి రేణుక సింగ్‌
Renuka Singh
Follow us on

Eklavya Model Residential School: ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 28 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ళు మంజూరైనట్లు గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్‌ తెలిపారు. రాజ్యసభలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన 28 ఏకలవ్య స్కూళ్ళలో 11 విశాఖపట్నం జిల్లాలోను 6 తూర్పు గోదావరి జిల్లాలోను ఉన్నట్లు చెప్పారు.

దేశ వ్యాప్తంగా ఏకలవ్య సూళ్ళలో నాణ్యమైన విద్యా బోధన అందించేందుకు అవసరమైన విధాన నిర్ణయాలు తీసుకుని సహకరించడానికి వీలుగా 2019లో గిరిజన విద్యార్ధుల జాతీయ విద్యా సంఘాన్ని (ఎన్‌ఈఎస్‌టీఎస్‌)ను నెలకొల్పడం జరిగిందని మంత్రి తెలిపారు.  ఈ సంస్థను నెలకొల్పిన తొలి ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్‌లోని ఏకలవ్య స్కూళ్ళలో 92 శాతం మంది టెన్త్‌ విద్యార్ధులు, 88 శాతం మంది ఇంటర్‌ విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారని కేంద్రమంత్రి రేణుక వెల్లడించారు.

ఇంటర్‌లో ఉత్తీర్ణులైన విద్యార్ధుల్లో 13 మంది ఇంజనీరింగ్‌ కోర్సుల్లోను, 11 మంది మెడికల్‌ కోర్సుల్లోను 21 మంది ఇతర ప్రొఫెనల్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందారని తెలిపారు. ఏకలవ్య విద్యాలయాల్లో విద్యార్ధులు జేఈఈ, నీట్‌లో కూడా రాణించేందుకు వీలుగా దక్షణ ఫౌండేషన్‌ ద్వారా ఎంపిక చేసిన ఇంటర్‌ విద్యార్ధులకు ప్రత్యేకంగా కోచింగ్‌ ఇస్తున్నట్లు ఆమె చెప్పారు.

Read also : Beggars: భిక్షగాళ్ల మధ్య పంపకాలలో తేడాలు రావడంతో.. ఊహించని పరిణామం