Andhra Pradesh: నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి కలకలం.. రోడ్డుదాటుతుండగా చిత్రీకరించిన వీడియో!

| Edited By: Srilakshmi C

Jan 28, 2024 | 12:31 PM

నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాలలో మళ్ళీ మరోసారి పెద్దపులి కలకలం రేగింది. ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు సమీపంలో పెద్దపులి హల్చల్ చేసింది. గ్రామ సమీపంలో వరదరాజ స్వామి ప్రాజెక్టుకు వెళ్లే రహదారిలో రోడ్డు దాటుతూ పెద్దపులి కనిపించడంతో గ్రామస్తులు పెద్దపులిని సెల్‌ ఫోన్ల్‌ చిత్రీకరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత నెల రోజుల నుంచి పెద్దపులి గ్రామ పరిసరాల్లో..

Andhra Pradesh: నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి కలకలం.. రోడ్డుదాటుతుండగా చిత్రీకరించిన వీడియో!
Tiger In Atmakuru
Follow us on

ఆత్మకూరు, జనవరి 28: నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాలలో మళ్ళీ మరోసారి పెద్దపులి కలకలం రేగింది. ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు సమీపంలో పెద్దపులి హల్చల్ చేసింది. గ్రామ సమీపంలో వరదరాజ స్వామి ప్రాజెక్టుకు వెళ్లే రహదారిలో రోడ్డు దాటుతూ పెద్దపులి కనిపించడంతో గ్రామస్తులు పెద్దపులిని సెల్‌ ఫోన్ల్‌ చిత్రీకరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత నెల రోజుల నుంచి పెద్దపులి గ్రామ పరిసరాల్లో సంచరిస్తుందని, పంట పొలాల్లో గ్రామానికి సమీపంగా వచ్చి వెళుతుందని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికీ గ్రామానికి చెందిన పశువులను మేకలను చాలా వాటిని చంపి తినిందని గ్రామస్తులు అంటున్నారు. కానీ ఈ విషయాలను బయటకి రాకుండా ఫారెస్ట్ అధికారులు జాగ్రత్త పడుతున్నారు. కాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పులుల సంచారం జనాల్ని బెంబేలెత్తిస్తున్నాయి.

తాజాగా ఏలూరు జిల్లాలో పులుల సంచారం ప్రజ‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేశాయి. ఇటీవ‌ల కాలంలో అక్కడ పలు చోట్ల పులులు సంచరిస్తున్నట్లు తెలియడంతో జనాలు క‌ల‌వ‌ర పడుతున్నారు. తాజాగా సత్తెన్నగూడెం గ్రామ శివారులోని ఒక తోటలో పెద్ద పులి జాడలు కనిపించాయి. దీంతో ఆ ప్రాంత వాసులు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. జిల్లా బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లోనూ పులులు సంచరిస్తున్నాయంటూ స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.