
అమ్మ ప్రేమ ఎవరి మీదైనా ఒకేలాగా ఉంటుంది అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. అది మనుషులలోనైనా జంతువులలోనైనా ఎవరివైనా అమ్మ ప్రేమకు సాటి రాదు. సహజంగా పందులకు, కుక్కలకు అస్సలు పడదు. పందులు కనిపిస్తే కుక్కలు వెంట పడతాయి. కుక్క పిల్లలు కనిపిస్తే పందులు కసితీరా దాడి చేస్తాయి. అలాంటిది జాతి వైరాన్ని మరచి కుక్క పిల్లకు పాలు ఇచ్చింది ఓ పంది. ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ నగర పంచాయతీ పరిధిలోని గ్యాస్ గోడౌన్ దగ్గర వరాహం కుక్క పిల్లలకు పాలిచ్చింది. ఆకలితో అలమటిస్తున్న ఒక్క పిల్లలకు వరాహం పాలిస్తున్న సంఘటన చూసి అక్కడి వారంతా షాక్ అయ్యారు. తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన వరాహం మనసుని అందరూ మెచ్చుకున్నారు. తల్లి ప్రేమ అంటే ఒక మనషులలోనే కాదని ప్రతి జంతువులను ప్రతి ప్రాణిలోనూ తల్లి ప్రేమ ఉంటుందని మరోసారి నిరూపితమైంది.
నాది నీది అని కాకుండా తారతమ్యం లేకుండా ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చడమే తల్లి ప్రేమ. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసినప్పటికీ ఇది కూడా తల్లి ప్రేమకు నిదర్శనమే. కాబట్టి శునకాల ఆకలి తీర్చిన వరాహం ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరి మనసును గెలుచుకుంది. తన స్వచ్చమైన తల్లి హృదయం చాటి చెప్పింది. దీనిని అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా ఇప్పుడది వైరల్ గా మారింది.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..