Andhra Pradesh: బాలికపై అత్యాచారం చేశాడు.. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఏం చేశారంటే

|

May 22, 2023 | 4:12 AM

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. టి.పసలవాండ్లపల్లి పంచాయతీ ఉదారవాండ్లపల్లికి చెందిన 13 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ముత్తన్న(43) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికపై కత్తితో దాడి చేశాడు.

Andhra Pradesh: బాలికపై అత్యాచారం చేశాడు.. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఏం చేశారంటే
Rape case
Follow us on

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. టి.పసలవాండ్లపల్లి పంచాయతీ ఉదారవాండ్లపల్లికి చెందిన 13 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ముత్తన్న(43) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికపై కత్తితో దాడి చేశాడు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన ఆ బాలిక ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆమె ఎనిమిదో తరగతి చదువుతోంది. అయితే ఆదివారం రోజున సాయంత్రం పూట సమీప పొలాల్లో ఆవులు మేపుతుండగా ముత్తన్న ఆమెపై అత్యాచారాణికి ఒడిగట్టాడు.

సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు మూకుమ్మడిగా నిందితుడిపై దాడికి దిగారు. రాళ్లు, కర్రలతో ఇష్టమొచ్చినట్టు కొట్టారు. దీంతో ముత్తన్న అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల నుంచి వివరాలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే నిందితుడు ముత్తన్న గతంలోనే తన భార్యను చంపి ఏడేళ్లు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించాడు. రెండేళ్ల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే ఇతడు తరచూ గ్రామంలో కత్తి పట్టుకొని తిరుగేవాడని.. అందర్నీ బెదిరించేవాడని స్థానికులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి