విద్యుత్ టవర్ ఎక్కి యువకుడు హల్ చల్..!

ప్రేమించిన యువతితో తనకు వివాహం జరిపించకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు విద్యుత్ టవర్ ఎక్కి హల్ చల్ చేసిన ఘటన శనివారం సాయంత్రం ఆలమూరు మండలంలోని చొప్పెల్ల లాకుల వద్ద చోటు చేసుకుంది. అసలు వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని బడుగువాని లంకకు చెందిన అజయ్ అనే యువకుడు ఆ ఊరికి చెందిన ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. తన కుటుంబ సభ్యులు ప్రేమకు అడ్డంకి చెప్పడంతో.. ప్రేమించిన అమ్మాయితో వివాహం జరిపించకపోతే […]

విద్యుత్ టవర్ ఎక్కి యువకుడు హల్ చల్..!

Updated on: Mar 16, 2019 | 6:35 PM

ప్రేమించిన యువతితో తనకు వివాహం జరిపించకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు విద్యుత్ టవర్ ఎక్కి హల్ చల్ చేసిన ఘటన శనివారం సాయంత్రం ఆలమూరు మండలంలోని చొప్పెల్ల లాకుల వద్ద చోటు చేసుకుంది.

అసలు వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని బడుగువాని లంకకు చెందిన అజయ్ అనే యువకుడు ఆ ఊరికి చెందిన ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. తన కుటుంబ సభ్యులు ప్రేమకు అడ్డంకి చెప్పడంతో.. ప్రేమించిన అమ్మాయితో వివాహం జరిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని విద్యుత్ టవర్ ఎక్కాడు. కాగా టవర్ ఎక్కి హల్ చల్ చేసిన యువకుడిని సబ్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ చాకచక్యంగా వ్యవహరించి యువకుడిని అదుపులోకి తీసుకున్నాడు.