Ongole: ఈ దొంగోడు అంతలా కన్నం వేసింది వేటి కోసమే తెల్సా..? చివరకు

| Edited By: Ram Naramaneni

Jan 12, 2025 | 12:49 PM

అది పాత బ్యాలెట్‌ బాక్స్‌లు భద్రపరిచిన గది. ఎప్పట్నుంచో తాళం వేసింది ఉంది. వాటిని పట్టించుకునేవాడు లేవు. ఆ బ్యాలెట్ బాక్సులు అన్నీ తప్పు పట్టిపోయాడు. వాటిని చోరీ చేయాలనుకున్నాడు ఓ వ్యక్తి. పక్కాగా ప్లాన్ చేసుకుని వచ్చాడు. పెద్ద గోడకు కన్నం వేశాడు. ఆ తర్వాత అసలు ట్విస్ట్ ఎదురైంది. డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Ongole: ఈ దొంగోడు అంతలా కన్నం వేసింది వేటి కోసమే తెల్సా..? చివరకు
Theft
Follow us on

సాధారణంగా ఏ బ్యాంకుకో, నగల షాపుకో కన్నం వేసి చోరీ చేయడం చూస్తుంటాం… అయితే తుప్పు పట్టిన పాత బ్యాలెట్‌ బాక్స్‌లు భద్రపరిచిన గదికి కన్నం వేశాడో దొంగ… లోపల భద్రపరిచిన ఎన్నికల బ్యాలెట్‌ బాక్స్‌లను ఒక్కొక్కటి బయటకు తెచ్చి చెత్త రిక్షాలో వేసుకున్నాడు… తీరా వాటిని తరలించే క్రమంలో స్థానికులు గుర్తించి కేకలు వేయడంతో పరారయ్యాడు… సమాచారం అందుకున్న పోలీసులు బ్యాలెట్‌ బాక్స్‌లు భద్రపరిచిన గదికి చేరుకుని పరిశీలించారు… గతంలోనే కన్నం వేసి పలుమార్లు బ్యాలెట్‌ బాక్సులు ఎత్తుకెళ్ళినట్టు అనుమానిస్తున్నారు… ఈ ఘటనపై పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

ఒంగోలులోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరం వెనుక వైపు ఉన్న గదిలో గతంలో ఎన్నికల్లో వినియోగించిన పాత ఇనుప బ్యాలెట్‌ బాక్స్‌లను భద్రపరిచారు… గదిలో సీల్‌ వేశారు… తుప్పుపట్టిన స్థితిలో బ్యాలెట్‌ బాక్స్‌లు గదిలో ఉన్న విషయాన్ని గుర్తించిన కొంతమంది దొంగలు వాటిని ఎత్తుకెళ్ళేందుకు ప్లాన్‌ వేశారు… సమావేశ మందిరం వెనుక గది గోడకు కన్నం వేశారు… ఆ కన్నం నుంచి లోపలికి దూరి గదిలో ఉన్న బ్యాలెట్‌ బాక్స్‌లను ఎత్తుకుని బయటకు తెచ్చారు… అప్పటికే సిద్దం చేసి ఉంచిన చెత్త తరలించే వాహనంలోకి బ్యాలెట్‌ బాక్స్‌లను సర్దుకున్నారు… అయితే ఈ తతంగాన్ని గమనించిన స్థానికులు కేకలు వేయడంతో బ్యాలెట్‌ బాక్సులను, చెత్త వాహానాన్ని అక్కడే వదిలి పరారయ్యారు… గత కొంతకాలంగా ఈ విధంగా ఎన్ని బ్యాలెట్‌ బాక్స్‌లను ఎత్తుకెళ్ళారో అన్న అనుమానంతో గదిలో ఉన్న బ్యాలెట్‌ బాక్సులను లెక్కించే పనిలో పడ్డారు… ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు… ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికల బ్యాలెట్‌ బాక్స్‌లు కావడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి