Andhra Pradesh: మద్యం సీసాలో పురుగులు, చెత్తాచెదారం రావడంతో అది గమనించకుండా సేవించిన ఓ వ్యక్తి వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. గురువారం తెనాలిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా మద్యం ప్రియులను షాక్‌కి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. తెనాలిలోని నందులపేటకు చెందిన కిషోర్ అనే వ్యక్తి ప్రభుత్వ మద్యం షాపులో ఓ మద్యం సీసాను కొనుగోలు చేశాడు. అయితే కిషోర్ ఆ బాటిల్‌ను తన స్నేహితునికి బహుమతిగా ఇచ్చాడు. బాటిల్‌ను సరిగ్గా గమనించని కిషోర్ స్నేహితుడు మద్యాన్ని కొంత సేవించాడు. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా వాంతులు, విరేచననాలతో బాధపడి అపస్మారక స్థితికిలోకి వెళ్లాడు. దీంతో విషయం తెలుసుకున్న కిషోర్.. మద్యం బాటిల్‌ను గమనించే సరికి అందులో చెత్తాచెదారం, పురుగులు ఉండడాన్ని గమనించాడు.
వెంటనే మద్యం దుకాణానికి వెళ్లిన కిషోర్.. ఈ విషయాన్ని సంబంధిత దుకాణం సిబ్బందికి తెలియజేశాడు. అయితే తాము కేవలం ఉద్యోగులమేనని తాము చేసేది ఏమీ లేదని చెప్పిన సదరు వ్యక్తులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇక ఈ విషయమై కిషోర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నడుపుతున్న దుకాణాల్లోని మద్యంలో ఇలా చెత్తాచెదారం వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. తన్న స్నేహితుడికి ఏమైనా అయితే పూర్తిగా ప్రభుత్వానికి బాధ్యత అని, పూర్తి పరిశీలన చేయకుండా ఇలాంటి వాటిని ఎందుకు అమ్ముతున్నారని అన్నాడు. ఇదిలా ఉంటే ఈ విషయం తెలసిన మద్యం ప్రియులు మద్యం సేవించే ముందు ఒకటికి రెండు సార్లు బాటిల్‌ను చెక్ చేసుకోవాలని భావిస్తున్నారు.
నాగరాజు, టీవీ9, గుంటూరు.
Also Read: Top 9 News: తెలుగు రాష్ట్రాల ట్రెండింగ్ వార్తలు.. పొలిటికల్ న్యూస్ సమాహారం “టాప్ 9 న్యూస్” (వీడియో)
IND vs NZ: రహానె, పుజారాను తప్పించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..
Jawad Cyclone Live: దూసుకొస్తున్న జవాద్ తుపాన్.. భారీ వర్షాలు పడే అవకాశం.. అప్రమత్తమైన అధికారులు..